iQOO: 16జిబి ర్యామ్ పవర్‌తో భారత్‌లో లాంచైన iQOO Z9 5G

Highlights

  • భారత్‌లో iQOO Z9 5G లాంచ్
  • 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్

Vivo సబ్-బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్ లో iQOO Z9 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్ పవర్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 256జిబి స్టోరేజీ, 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి iQOO Z9 5G యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iQOO Z9 5G ధర, లభ్యత

iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వాటి ధరలు తెలుసుకుందాం.

iQOO Z9 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

ఐసీఐసీఐ మరియు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. 3 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

మార్చి 14 నుంచి అధికార వెబ్‌సైట్ మరియు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా iQOO Z9 5G సేల్ కి అందుబాటులో ఉంటుంది.

iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ బ్రష్డ్ గ్రీన్ మరియు గ్రాఫీన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

iQOO Z9 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Z9 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Z9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి 610 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. యూజర్ కి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ద్వారా గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: iQOO Z9 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: iQOO Z9 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
  • కనెక్టివిటీ: iQOO Z9 5G లో డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ, బ్లూటూత్, వై-ఫై 6 ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: iQOO Z9 5G లో ఐపీ54 రేటింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Previous articleRealme: భారత్‌లో లాంచైన Realme 12 Pro 5G 12జిబి ర్యామ్ వేరియంట్
Next articleVivo: ఫ్లిప్‌కార్ట్ పేజీ ద్వారా రివీలైన Vivo T3 5G డిజైన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.