Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో ఒక కొత్త జెడ్-సిరీస్ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. iQOO Z9 5G పేరుతో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. చాలా రోజులుగా ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తోంది. మార్చి 12న ఈ ఫోన్ అఫీషియల్ లాంచ్ ఉంటుంది. అయితే ఈలోపే, iQOO Z9 5G ధర శ్రేణి మరియు స్పెసిఫికేషన్స్ ఒక లీక్ ద్వారా రివీల్ అయ్యాయి. లీక్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.25,000 లోపు ఉంటుందని అంచనా. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
iQOO Z9 5G ఇండియా ధర శ్రేణి (లీక్)
iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ధర శ్రేణి మరియు స్పెసిఫికేషన్స్ ని టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేశారు.
యోగేశ్ పోస్ట్ ప్రకారం, iQOO Z9 5G ధర రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య ఉంటుంది. బేస్ మోడల్ ధర ఈ రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు.
iQOO Z9 5G ఎన్ని స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుందో ఇంకా తెలియదు. ధరలు కూడా వాటి ప్రకారం మారుతాయి.
iQOO Z9 5G
– 6.6" FHD+ AMOLED, 120Hz
– MediaTek Dimensity 7200 SoC
– 50MP (IMX882) OIS + 2MP
– 16MP selfie
– Android 14, FunTouch OS
– 5,000mAh battery
– 44W chargingPricing: Rs 20-25k
Launch: March 12thThoughts?
— Yogesh Brar (@heyitsyogesh) February 27, 2024
iQOO Z9 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: iQOO Z9 5G లో 6.6-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
- ప్రాసెసర్: iQOO Z9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుంది.
- కెమెరా: iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటుంది.
- బ్యాటరీ: iQOO Z9 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: iQOO Z9 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
iQOO Z9 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)
అమెజాన్ మరియు ఐకూ అధికార వెబ్‌సైట్ పై iQOO Z9 5G లిస్ట్ అయ్యింది. దీంతో కొన్ని స్పెసిఫికేషన్స్ కన్ఫర్మ్ అయ్యాయి.
iQOO Z9 5G మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ కెమెరా సెన్సర్ ఈ ఫోన్ లో ఉంటుంది.
