Home News iQOO Z9 Lite 5G: తక్కువ ధరలో లాంచైన ఐకూ జెడ్9 లైట్ 5జీ

iQOO Z9 Lite 5G: తక్కువ ధరలో లాంచైన ఐకూ జెడ్9 లైట్ 5జీ

Highlights
  • భారత్‌లో iQOO Z9 Lite 5G లాంచ్
  • డివైజ్ ధర రూ.10,499
  • అమెజాన్ ద్వారా సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్ లో జెడ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. iQOO Z9 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ 5జీ ఫోన్ తక్కువ ధరలో లాంచ్ అయ్యింది. ఐకూ సంస్థ ఈ ఫోన్ ప్రారంభ ధరను రూ.10,499 గా నిర్ణయించింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

iQOO Z9 Lite 5G ధర, లభ్యత

iQOO Z9 Lite 5G రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.10,499 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. ఈ ఫోన్లు ఆక్వా ఫ్లో (బ్లూ) మరియు మోకా బ్రౌన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. జులై 20వ తేదీ నుంచి ఈ ఫోన్ అమెజాన్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా అమ్మకానికి వస్తోంది. రూ.500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ద్వారా ఈ ఫోన్‌ బేస్ మోడల్‌ని రూ.9,999 కే సొంతం చేసుకోవచ్చు. టాప్ మోడల్ రూ.10,999 కే లభిస్తుంది.

iQOO Z9 Lite 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Z9 Lite 5G లో 6.56-ఇంచ్ అల్ట్రా బ్రైట్ స్క్రీన్, 840 నిట్స్ బ్రైట్నెస్ మరియు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: iQOO Z9 Lite 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. అంటుటు సైట్ పై ఈ చిప్సెట్ 414,564 స్కోర్ నమోదు చేసింది.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 Lite 5G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 6జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: iQOO Z9 Lite 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఏఐ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: iQOO Z9 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: iQOO Z9 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: iQOO Z9 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ64 రేటింగ్ ఉన్నాయి.