Home News iQOO Z9 Turbo+: 16GB ర్యామ్‌తో చైనాలో లాంచైన ఐకూ కొత్త ఫోన్

iQOO Z9 Turbo+: 16GB ర్యామ్‌తో చైనాలో లాంచైన ఐకూ కొత్త ఫోన్

Highlights
  • చైనాలో iQOO Z9 Turbo+ విడుదల
  • 512జిబి స్టోరేజీ, 16జిబి ర్యామ్
  • ప్రారంభ ధర రూ.27,300

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నేడు తన హోమ్ మార్కెట్ చైనాలో జెడ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. iQOO Z9 Turbo+ పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. శక్తివంతమైన ఫీచర్లను ఈ ఫోన్ లో అందించారు. 16జిబి ర్యామ్, 6400 ఎంఏహెచ్ బ్యాటరీ, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Z9 Turbo+ ధర

iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ 4 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలను తెలుసుకుందాం.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2,299 యువాన్లు (సుమారు రూ.27,300) గా ఉంది.

16జిబి+256జిబి వేరియంట్ ధరను 2,499 యువాన్లు (సుమారు రూ.29,700) గా నిర్ణయించారు.

12జిబి+512జిబి వేరియంట్ ధర 2,699 యువాన్లు (సుమారు రూ.32,000) గా ఉంది.

16జిబి+512జిబి మోడల్ ధర 2,899 యువాన్లు (సుమారు రూ.34,400) గా ఉంది.

ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. త్వరలోనే ఐకూ నుంచి ప్రకటన వస్తుందేమో చూడాలి.

iQOO Z9 Turbo+ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Z9 Turbo+ లో 6.78-ఇంచ్ 1.5కే స్క్రీన్, ఓఎల్ఈడీ హుఆక్సింగ్ సీ8 ప్యానెల్, 2800*1200 పిక్సెల్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: iQOO Z9 Turbo+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్సెట్ వాడారు. దీనికి తోడు క్యూ1 సూపర్‌కంప్యూటింగ్ చిప్ కూడా అందించారు. ఇంకా 6043ఎంఎం స్క్వేర్ వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 Turbo+ డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: iQOO Z9 Turbo+ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి గెలాక్సీ కోర్ సీసీ08ఏ3 సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి శాంసంగ్ ఎస్5కే3పీ9 ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: iQOO Z9 Turbo+ డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 6,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: iQOO Z9 Turbo+ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 7, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్ యాక్సిస్ లీనియర్ మోటర్, డ్యూయల్ స్పీకర్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.