ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో జెడ్9ఎస్ సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా iQOO Z9s, Z9s Pro 5G అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ సిరీస్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. భారత్ లో ఈ సిరీస్ ఆగస్టు 21వ తేదీన లాంచ్ అవుతాయని ఐకూ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
iQOO Z9s సిరీస్ లాంచ్ తేదీ
ఐకూ ఇండియా తాజాగా iQOO Z9s సిరీస్ భారత మార్కెట్ లాంచ్ తేదీని ప్రకటించింది. ఆగస్టు 21న ఈ సిరీస్ విడుదలవ్వనుందని కంపెనీ వెల్లడించింది. ఈ లైనప్ లో ఐకూ జెడ్9ఎస్ మరియు ఐకూ జెడ్9ఎస్ ప్రో అనే మోడల్స్ లాంచ్ కానున్నాయి. లాంచ్‌ని ఐకూ యొక్క అధికార వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్ పై చూడవచ్చు.
iQOO Z9s Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
డిస్ప్లే: iQOO Z9s Pro లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
ప్రాసెసర్: iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.63 గిగాహెర్ట్జ్.
మెమొరీ: iQOO Z9s Pro డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ కానుందని సమాచారం.
కెమెరా: iQOO Z9s Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ఓఐఎస్ మెయిన్ కెమెరాతో పాటు రెండు ఇతర సెన్సర్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: iQOO Z9s Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: iQOO Z9s Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.
