Home News iQOO Z9s, Z9s Pro: లాంచ్‌కి ముందు ఖరారైన జెడ్9ఎస్, జెడ్9ఎస్ ప్రో ప్రధాన స్పెసిఫికేషన్స్, కలర్స్

iQOO Z9s, Z9s Pro: లాంచ్‌కి ముందు ఖరారైన జెడ్9ఎస్, జెడ్9ఎస్ ప్రో ప్రధాన స్పెసిఫికేషన్స్, కలర్స్

Highlights
  • ఆగస్టు 21న iQOO Z9s సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న iQOO Z9s, Z9s Pro
  • 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో భారత్ లో జెడ్9ఎస్ సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Z9s మరియు iQOO Z9s Pro అనే మోడల్స్ విడుదల కానున్నాయి. ఈ ఫోన్లు భారత్ లో ఆగస్టు 21వ తేదీన లాంచ్ అవుతున్నాయి. ఇక వీటికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ షేర్ చేస్తూ వస్తోంది. తాజా అప్డేట్ లో ఈ ఫోన్ల యొక్క బ్యాటరీ కెపాసిటీ, ఐపీ రేటింగ్, కలర్స్ మరియు ఇతర వివరాలు ఖరారయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

iQOO Z9s మరియు iQOO Z9s Pro వివరాలు (ఖరారైనవి)

కంపెనీ వెబ్‌సైట్ పై ఉన్న మైక్రోసైట్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం, iQOO Z9s లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

iQOO Z9s Pro 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 7.49 మి.మీ మందం ఉంటాయి. ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ ఫోన్లు రానున్నాయి.

iQOO Z9s స్మార్ట్‌ఫోన్ భారత్ లో రెండు కలర్స్ లో లాంచ్ అవుతుంది. అవి: టైటానియమ్ మ్యాట్ మరియు ఆనిక్స్ గ్రీన్.

iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్ లక్స్ మార్బుల్ మరియు ఫ్లామ్‌బాయంట్ ఆరెంజ్ కలర్స్ లో లాంచ్ అవుతుంది.

iQOO Z9s మరియు iQOO Z9s Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Z9s మరియు iQOO Z9s Pro ఫోన్లలో 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. iQOO Z9s లో 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. మరోవైపు, ప్రో వేరియంట్ లో 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది.

చిప్సెట్: iQOO Z9s లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది. iQOO Z9s Pro క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అవుతుంది.

కెమెరా: iQOO Z9s సిరీస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. బేస్ మోడల్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ కెమెరా ఉంటాయి. ప్రో వేరియంట్ లో ప్రైమరీ కెమెరాతో పాటు, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంటుంది. ఈ కెమెరాలో ఏఐ ఫోటో ఎన్హాన్స్ మరియు ఏఐ ఎరేజ్ ఆప్షన్స్ ఉంటాయి.

iQOO Z9s, iQOO Z9s Pro ధర (అంచనా)

iQOO Z9s మరియు iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్ల ధర భారత్ లో రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా కంపెనీ నుంచి ధరలకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ఆగస్టు 21వ తేదీన అన్ని విషయాలు తెలుస్తాయి.