6.6-ఇంచ్ డిస్ప్లేతో లాంచైన itel a05s; ధర రూ.6,499 మాత్రమే!

Highlights

  • భారత్ లో లాంచైన itel a05s
  • ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తో వచ్చిన డివైజ్
  • itel a05s 2జిబి+32జిబి మోడల్ ధర రూ.6,499

చవకైన ఫోన్లను తయారు చేసే టెక్ బ్రాండ్ itel భారతీయ మార్కెట్ లో ఒక కొత్త లో-బడ్జెట్ ఫోన్ ని లాంచ్ చేసింది. itel a05s అనే పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధర కేవలం రూ.6,499 మాత్రమే. ఎంట్రీ లెవెల్ స్పెసిఫికేషన్స్ ని ఈ ఫోన్ లో అందించారు. చాలా తక్కువ ధరలో ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ కోసం చూసే వారికి ఇదొక మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి itel a05s డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

itel a05s ధర

itel a05s స్మార్ట్‌ఫోన్ సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. 2జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.6,499 గా నిర్ణయించారు. నెబులా బ్లాక్, మీడో గ్రీన్, క్రిస్టల్ బ్లూ మరియు గ్లోరియస్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. itel a05s ఫోన్‌ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

itel a05s స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: itel a05s లో 6.6-ఇంచ్ భారీ డిస్ప్లే, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ప్యానెల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • బ్యాటరీ: itel a05s లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయదు. అయితే ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 32 రోజుల స్టాండ్‌బై టైమ్ లేదా 112 గంటల మీడియా ప్లే టైమ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
  • ప్రాసెసర్: itel a05s లో యూనిఎస్ఓసీ స్ప్రెడ్‌ట్రమ్ 9863ఏ చిప్సెట్ వాడారు. ఇది 1.6గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ఓఎస్: itel a05s స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై పని చేస్తుంది. గో ఎడిషన్ కావడం వల్లన, తక్కువ ర్యామ్ వినియోగించుకుని, స్మూథ్ గా పని చేసే గూగుల్ గో యాప్స్ ని డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. అంతేకాదు, ఈ గూగుల్ గో యాప్స్ ఇంటర్నెట్ మరియు బ్యాటరీని తక్కువగా వాడుకుంటాయి.
  • మెమొరీ: itel a05s స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో 2జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. అయితే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: itel a05s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 5ఎంపి మెయిన్ కెమెరా, ఒక సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఇతర ఫీచర్స్: itel a05s లో భద్రత కోసం రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ ఫోన్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ డివైజ్ లో 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది.
  • కనెక్టివిటీ: itel a05s లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.