చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు itel తాజాగా భారత్ లో itel A50 మరియు itel A50C అనే తక్కువ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా UniSoc ఆక్టా-కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ గో ఓఎస్, 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేతో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు ఫోన్ల యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
itel A50, itel A50C ధర, సేల్ వివరాలు
itel A50C 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.5,699 గా నిర్ణయించారు. ఈ ఫోన్ సఫైర్ బ్లాక్, డాన్ బ్లూ మరియు మిస్టీ ఆక్వా కలర్స్ లో లభిస్తుంది.
itel A50 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.6,099 గా పెట్టారు. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర రూ.6,499 గా ఉంది.
మీరు ఈ రెండు ఫోన్లను ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేయవచ్చు. సేల్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
రెండు ఫోన్లు కూడా ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ తో వచ్చాయి. ఇంకా ఏడాది వ్యారంటీని ఈ ఫోన్లపై అందిస్తున్నారు. ఫోన్ కొన్నప్పటి నుంచి 100 రోజుల వరకు స్క్రీన్ రీప్లేస్మెంట్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. దీనికి లేబర్ చార్జీలు కూడా ఉండే అవకాశం ఉంది.
itel A50 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
స్క్రీన్: itel A50 లో 6.56-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 267 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: itel A50 లో యూనిఎస్ఓసీ టీ603 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్. 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై ఈ చిప్ తయారైంది. మాలి జీ57 ఎంపీ1 జీపీయూని ఈ ఫోన్ లో అందించారు.
కెమెరా: itel A50 లో 8ఎంపి మెయిన్ కెమెరా అందించారు. దీనికి తోడుగా ఒక ఏఐ ఆగ్జిలరీ సెకండరీ సెన్సర్ కూడా ఉంది. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
మెమొరీ: itel A50 3జిబి మరియు 4జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 64జిబి ఇంటర్నల్ స్టోరేజీని అన్ని వేరియంట్లలో అందించారు.
బ్యాటరీ: itel A50 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. యూఎస్బీ-సీ పోర్ట్ ని ఈ ఫోన్ లో ప్రొవైడ్ చేశారు.
ఇతర ఫీచర్లు: itel A50 లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, సాఫ్ట్‌వేర్-బేస్డ్ డైనమిక్ బార్, వాటర్ డ్రాప్ నాచ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి.
itel A50C స్పెసిఫికేషన్స్
itel A50C 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్నీ itel A50 లో మాదిరే ఉంటాయి.
