టెక్ బ్రాండ్ itel నేడు భారతీయ మార్కెట్ లో itel A70 అనే స్మార్ట్ఫోన్ ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో వచ్చిన ఈ ఫోన్ లో 4జిబి ఇంటర్నల్ ర్యామ్, 8జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్, 8ఎంపి సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో ఎంట్రీ లెవల్ ఫోన్ కోసం చూసే వారు ఈ డివైజ్ ని ప్రయత్నించవచ్చు. సరే, ఓసారి itel A70 స్మార్ట్ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
itel A70 ధర, కలర్ ఆప్షన్స్
- itel A70 స్మార్ట్ఫోన్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
- itel A70 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.6,299 గా నిర్ణయించారు.
- itel A70 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.6,799 గా ఉంది.
- itel A70 4జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధరను రూ.7,299 గా నిర్ణయించారు.
- itel A70 డివైజ్ ని జనవరి 5 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
- itel A70 స్మార్ట్ఫోన్ ఫీల్డ్ గ్రీన్, అజూర్ బ్లూ, బ్రిలియంట్ గోల్డ్ మరియు స్టార్లిష్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
itel A70 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: itel A70 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: itel A70 లో యూనిఎస్ఓసీ టీ603 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం పవర్వీఆర్ జీఈ8322 జీపీయూ వినియోగించారు.
- ఓఎస్: itel A70 స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆధారిత ఐటెల్ ఓఎస్ 13 కస్టమ స్కిన్ పై పని చేస్తుంది.
- ర్యామ్, స్టోరేజీ: itel A70 డివైజ్ 4జిబి ఫిజికల్ ర్యామ్, 8జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్, 64జిబి/128జిబి/256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
- కెమెరా: itel A70 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: itel A70 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.
- ఇతర ఫీచర్లు: itel A70 లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్లాక్ ఫీచర్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ కేవలం 8.6 మి.మీ మందం మాత్రమే ఉంటుంది.
