Home News ఈ కలర్ చేంజింగ్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,399 మాత్రమే, పూర్తి వివరాలు తెలుసుకోండి

ఈ కలర్ చేంజింగ్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,399 మాత్రమే, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights
  • itel Color Pro 5G పై డిస్కౌంట్
  • డైమెన్సిటీ 6080 చిప్సెట్
  • 50ఎంపి ఏఐ కెమెరా

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ itel జులైలో Color Pro 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. కలర్ చేంజింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ లో 12జిబి వరకు ర్యామ్, డైమెన్సిటీ 6080 చిప్సెట్, 6.6-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఏఐ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ పై రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఓసారి ఆఫర్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

itel Color Pro 5G ధర, ఆఫర్లు

itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం రూ.1,500 బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ రూ.8,399 కి లభిస్తోంది.

వన్‌ కార్డ్ క్రెడిట్ కార్డ్ మరియు ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

ఇంకా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

బ్యాంక్ ఆఫర్ తో పాటు, 3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో భాగంగా రూ.9,350 వరకు బోనస్ లభిస్తుంది. అయితే మీ ఫోన్ కండీషన్‌ను బట్టి ఈ బోనస్ విలువ ఆధారపడి ఉంటుంది.

itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్ లావెండర్ ఫాంటసీ మరియు రివర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ ధర రూ.9,999 కాగా, ఆఫర్ లో భాగంగా రూ.8,399 కి లభించనుంది.

ఆఫర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

itel Color Pro 5G ఫోన్ కొనవచ్చా?

itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్ నెక్స్ట్-జెన్ ఐవీసీవో (ఐటెల్ వివిడ్ కలర్) టెక్నాలజీతో వచ్చింది. దీంతో ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై సూర్యకాంతి పడినప్పుడు రంగు మారుతుంది. ఈ తరహా టెక్నాలజీని ఇదివరకు వివో, ఒప్పో స్మార్ట్‌ఫోన్లలో మనం చూశాం. ఇక itel Color Pro 5G లో శక్తివంతమైన డైమెన్సిటీ 6080 చిప్, 12జిబి వరకు ర్యామ్ (వర్చువల్ ర్యామ్‌తో కలిపి) ఉన్నాయి. కాబట్టి తక్కువ ధరలో 5జీ ఫోన్ కోసం చూస్తుంటే, ఈ ఫోన్ మీకు మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.

itel Color Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: itel Color Pro 5G లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి.

ప్రాసెసర్: itel Color Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. దీని అంటుటు స్కోర్ 4,20,000.

ర్యామ్, స్టోరేజీ: itel Color Pro 5G డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీతో మరొక 6జిబి వరకు ర్యామ్ పవర్ ను పెంచుకోవచ్చు. అంటే మొత్తం 12జిబి ర్యామ్ పవర్ యూజర్‌కి లభిస్తుంది.

కెమెరా: itel Color Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఏఐ సెన్సర్ అందించారు. పనోరమ మోడ్, ప్రో మోడ్, ఏఆర్ షాట్, టైమ్ ల్యాప్స్ వంటి ఫీచర్లు రియర్ కెమెరాలో అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: itel Color Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: itel Color Pro 5G డివైజ్ 10 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.