చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Itel త్వరలో భారత్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Color Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. ఈ ఫోన్ కలర్ చేంజింగ్ టెక్నాలజీతో వస్తోంది. ధర కూడా అందుబాటులోనే ఉండనుంది. 91మొబైల్స్ కి ఈ డివైజ్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం లభించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
త్వరలో itel Color Pro 5G లాంచ్
itel Color Pro 5G యొక్క ఎక్స్‌క్లూజివ్ వివరాలు ఇండస్ట్రీ వర్గాల నుంచి 91mobiles కి లభించాయి.
itel Color Pro 5G డివైజ్ ఐటెల్ వివిడ్ కలర్ టెక్నాలజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
ఐటెల్ వివిడ్ కలర్ టెక్నాలజీతో డివైజ్ బ్యాక్ ప్యానెల్‌పై సూర్యకాంతి పడటంతో కలర్ మారుతుంది. ఈ తరహా ఫోన్లను గతంలో వివో మరియు ఒప్పో బ్రాండ్స్ తీసుకొచ్చాయి.
itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,000 నుంచి రూ.15,000 మధ్య ఉంటుందని తెలుస్తోంది.
itel P55 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Itel P55 5G లో 6.6-ఇంచ్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
ప్రాసెసర్: Itel P55 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
మెమొరీ: Itel P55 5G లో 12జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, 6జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి.
కెమెరా: Itel P55 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఒక ఏఐ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఏఐ సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు.
బ్యాటరీ: Itel P55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Itel P55 5G డివైజ్ 10 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.
