చవకగా స్మార్ట్ఫోన్లు మరియు ఫీచర్ ఫోన్లను తీసుకొస్తూ జనాల ఆదరణను పొందిన Itel సంస్థ త్వరలో పవర్ సిరీస్ ని భారత్ లో లాంచ్ చేయనుందని సమాచారం. 91mobiles దీనిపై ఒక ఎక్స్క్లూజివ్ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం, ఈ Power సిరీస్ వచ్చే నెల లాంచ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లైనప్ లో 3 స్మార్ట్ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. అమెజాన్ ద్వారా ఈ ఫోన్లు సేల్ కి వస్తున్నాయి. ఇకపోతే ఈ ఫోన్లలో ఒక డివైజ్ ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలో లాంచ్ కానున్న Itel Power సిరీస్
- ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం, ఐటెల్ సంస్థ నుంచి Power సిరీస్ లో 3 స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి.
- ఐటెల్ పవర్ సిరీస్ లాంచ్ ఈవెంట్ ఫిబ్రవరిలో జరుగుతుందని సమాచారం. ఇంకా కచ్చితమైన తేదీని ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటన రానుంది.
- ఐటెల్ తీసుకొస్తోన్న మూడు ఫోన్లలో ఒకటి ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ ఓఎస్ తో రానుంది. ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ తో వస్తోన్న మొదటి ఫోన్ ఇదే కానుంది.
- ఐటెల్ పవర్ సిరీస్ లో రానున్న రెండో స్మార్ట్ఫోన్ మెరుగైన చిప్సెట్, అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యంతో రాబోతున్నట్లు సమాచారం.
- Itel Power సిరీస్ లో రానున్న మూడవ ఫోన్ ఎక్స్క్లూజివ్ ఇండియా-ఫస్ట్ మెమొరీ ఫీచర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
- రివీలైన మార్కెటింగ్ ఇమేజ్ లోని స్మార్ట్ఫోన్ ని గమనిస్తే, అది అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో వస్తున్నట్లు అర్థమవుతోంది.
- ఇమేజ్ కి క్యాప్షన్ గా పవర్ ప్లే అని రాసి ఉంది. ఇక ఫోన్ విషయానికి వస్తే, ఫ్లాట్ డిస్ప్లే, పంచ్-హోల్ కెమెరా ఉన్నాయి. ఫోన్ కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి.
- బ్యాటరీ పర్సంటేజీ మరియు సూపర్చార్జ్ వివరాలు సెల్ఫీ కెమెరాకు ఇరువైపులా పేర్కొనబడి ఉన్నాయి.
- డివైజ్ కి బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో నిలువుగా సెన్సర్స్ ఉన్నాయి. డివైజ్ ఫ్లాట్ ఎడ్జెస్ కలిగి ఉంది.
- Power సిరీస్ లో ఐటెల్ నుంచి రాబోవు ఫోన్ల యొక్క ధర వివరాలు ఇంకా తెలియలేదు. అన్నీ ఫోన్లు తక్కువ బడ్జెట్ కేటగిరీలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- గతంలో వచ్చిన Power సిరీస్ ఫోన్ Power 55 5G 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధర రూ.9,699 గా ఉంది. ఇప్పుడు రాబోవు కొత్త ఫోన్లు కూడా ఇదే ధర శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. సరే, ఓసారి itel Power 55 5G స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
itel Power P55 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: itel Power P55 5G లో 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: itel Power P55 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: itel Power P55 5G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.
- కెమెరా: itel Power P55 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ, ఛార్జింగ్: itel Power P55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్వేర్: itel Power P55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: itel Power P55 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
