తక్కువ బడ్జెట్ లో ఫోన్లను లాంచ్ చేస్తూ జనాల్లో itel సంస్థ గుర్తింపు సంపాదించింది. తాజాగా ఈ కంపెనీ itel P55+ డివైజ్ ని సౌతాఫ్రికా మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ లో 4జీ కనెక్టివిటీ మాత్రమే ఉంది. కానీ, గత మోడల్ itel P55 లో 5జీ కనెక్టివిటీ ఉంది. itel P55+ స్మార్ట్ఫోన్ లో Unisoc చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. సరే, ఓసారి itel P55+ డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
itel P55+ ధర, లభ్యత
- itel P55+ స్మార్ట్ఫోన్ గెలాక్సీ బ్లూ, రాయల్ గ్రీన్ మరియు మిటియోర్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- itel P55+ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర 140 డాలర్లు (సుమారు రూ.11,700) గా ఉంది.
- itel P55+ డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
itel P55+ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: itel P55+ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ఉన్నాయి.
- ప్రాసెసర్: itel P55+ లో Unisoc T606 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ1 జీపీయూ వినియోగించారు.
- ర్యామ్, స్టోరేజీ: itel P55+ డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఇంకా ఈ డివైజ్ 4జిబి/6జిబి/8జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
- కెమెరా: itel P55+ లో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఇంకా పనోరమా మోడ్, సూపర్ నైట్ మోడ్, ఏఐ క్లియర్ పొట్రెయిట్, ప్రో మోడ్, టైమ్ ల్యాప్స్ మోడ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- కనెక్టివిటీ: itel P55+ లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
- బ్యాటరీ, చార్జింగ్: itel P55+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: itel P55+ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
