itel బ్రాండ్ తాజాగా itel S23+ స్మార్ట్ఫోన్ ని అధికారికంగా టీజ్ చేసింది. ఈ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుంది. తన టీజర్ తో ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. ఇప్పటికే ఈ డివైజ్ ఇథియోపియా లో లాంచ్ అయ్యింది. తర్వాత యురోపియన్ మార్కెట్స్ లో కూడా itel S23+ ప్రవేశించింది. itel S23 సిరీస్ లో వస్తోన్న itel S23+ డివైజ్ రెండోది. ఇప్పుడు itel S23+ యొక్క ధర శ్రేణి, ప్రధాన స్పెసిఫికేషన్స్ ని కంపెనీ రివీల్ చేసింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
itel S23+ ధర శ్రేణి
itel S23+ డివైజ్ itel S23 సిరీస్ లో వస్తోన్న కొత్త ఫోన్. ఈ ఫోన్ ధర రూ.15,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రూ.15,000 లోపు ధరలో వస్తోన్న మొట్టమొదటి కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఫోన్ ఇదే కావడం విశేషం. తక్కువ ధరలో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ కలిగిన ఫోన్ కొనాలని భావించే వారికి itel S23+ ఉత్తమమైన ఎంపిక అయ్యే అవకాశం ఉంది.
itel S23+ స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: itel S23+ లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.
- చిప్సెట్: itel S23+ లో యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్ వాడనున్నారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ1 జీపీయూ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: itel S23+ లో 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 25జిబి యూఎఫ్ఎస్ 2.0 ఇంటర్నల్ స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉంటాయి.
- సాఫ్ట్వేర్: itel S23+ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఐటెల్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- రియర్ కెమెరా: itel S23+ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్, ఐ ట్రాకింగ్ ఫీచర్ ఉంటాయి.
- ఫ్రంట్ కెమెరా: itel S23+ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు.
- బ్యాటరీ: itel S23+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: itel S23+ లో డైనమిక్ ఐల్యాండ్ వంటి డైనమిక్ బార్ ఫీచర్ ఉంటుంది. ఇంకా భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు.
- కలర్స్: itel S23+ డివైజ్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: లేక్ సైయన్, ఎలిమెంటల్ బ్లూ. త్వరలోనే ఈ డివైజ్ లాంచ్ తేదీని కూడా ఐటెల్ సంస్థ ప్రకటించే అవకాశం ఉంది.
