
itel సంస్థ తాజాగా ఎస్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ని లాంచ్ చేసింది. itel S24 పేరుతో వచ్చిన ఈ డివైజ్ గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 3డీ మ్యాగ్నెటిక్ పార్టికల్ డిజైన్ మరియు కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ తో ఈ ఫోన్ వచ్చింది. అలాగే ఈ ఫోన్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ బార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సరే, ఓసారి itel S24 డివైజ్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
itel S24 ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్
itel S24 స్మార్ట్ఫోన్ మూడు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. త్వరలోనే ధరల ప్రకటన రానుంది.
itel S24 డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
itel S24 స్మార్ట్ఫోన్ డాన్ వైట్, కోస్ట్లైన్ బ్లూ మరియు స్టారీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
itel S24 స్మార్ట్ఫోన్ భారతీయ మార్కెట్ లో ఎప్పటి నుంచి లభించనుందో ఇంకా తెలియదు.

itel S24 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
- డిస్ప్లే: itel S24 లో 6.6-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ (1612*720 పిక్సెల్స్) రెజుల్యూషన్, 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: itel S24 లో మీడియాటెక్ హీలియో జీ91 అల్ట్రా చిప్సెట్, మాలి-జీ52 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: itel S24 డివైజ్ 4జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి ఈఎంఎంసీ స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
- కెమెరా: itel S24 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్6 3x ఇన్-సెన్సర్ జూమ్ ఈఐఎస్ ప్రైమరీ కెమెరా, క్యూవీజీఏ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ, చార్జింగ్: itel S24 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: itel S24 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బీడీఎస్, యూఎస్బీ 2.0, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: itel S24 లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
- బరువు, చుట్టుకొలత: itel S24 డివైజ్ 160మి.మీ పొడవు, 77.25 మి.మీ వెడల్పు, 8.3 మి.మీ మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.











