హైలైట్స్:
- భారత మార్కెట్ లో లాంచ్ అయిన itel Vision 3 Turbo, ధర రూ.7,699
- 6జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.6-ఇంచ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- బడ్జెట్ శ్రేణిని టార్గెట్ చేస్తూ వచ్చిన itel Vision 3 Turbo
తక్కువ ధర కలిగిన స్మార్ట్ ఫోన్లను తయారు చేయడంలో పేరు సంపాదించిన కంపెనీ Itel, తాజాగా భారత మార్కెట్ లో ఓ కొత్త లో-బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసింది. itel Vision 3 Turbo అనే పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.7,699 గా ఉంది. itel Vision 3 Turbo లో 6జిబి ర్యామ్, 6.6-ఇంచ్ భారీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
itel Vision 3 Turbo ధర
భారత్ లో itel Vision 3 Turbo ధరను రూ.7,699 గా నిర్ణయించారు. ఈ ఫోన్ మల్టీ గ్రీన్, జెవెల్ బ్లూ, డీప్ ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. కంపెనీ ఒకసారి ఉచితంగా స్క్రీన్ రిప్లేస్మెంట్ చేస్తుంది. అంటే ఫోన్ ని కొనుగోలు చేశాక 100 రోజుల్లోపు ఫోన్ డిస్ప్లేలో ఏమైనా సమస్యలు ఎదురైతే, itel కంపెనీ ఉచితంగా డిస్ప్లేని రీప్లేస్ చేస్తుంది. వంద రోజులు దాటితే స్క్రీన్ రిప్లేస్మెంట్ సర్వీస్ వర్తించదు.
itel Vision 3 Turbo స్పెసిఫికేషన్స్
itel Vision 3 Turbo ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. itel Vision 3 Turbo లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 2.5డి గ్లాస్, 269 పీపీఐ (పిక్సెల్ పర్ ఇంచ్), 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. కంపెనీ డిస్ప్లే లో ‘జీ + ఎఫ్’ ఇన్సెల్ టెక్నాలజీని ఉపయోగించింది.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో itel Vision 3 Turbo లాంచ్ అయ్యింది. ఈ ఫోన్లో UNISOC SC9863A ఆక్టాకోర్ ప్రాసెసర్ ని వాడారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్లో అమర్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ రివర్స్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేయడం విశేషం. 64 జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. అసలు ర్యామ్ 3జిబి కాగా, వర్చువల్ ర్యామ్ ద్వారా మరో 3జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు. ఈ విధంగా మొత్తంగా 6జిబి ర్యామ్ తో itel Vision 3 Turbo స్మార్ట్ ఫోన్ పెర్ఫామ్ చేస్తుంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం itel Vision 3 Turbo లో ముందు వైపున 5ఎంపి కెమెరాను అందించారు. ఫోన్ వెనకాల 8ఎంపి మెయిన్ కెమెరాతో పాటు ఒక ఏఐ కెమెరాను అమర్చారు. భద్రత కోసం ఇందులో రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. itel Vision 3 Turbo లో 4జీ ఎల్టీఈ, 3.5ఎంఎం ఆడియో జాక్, ఓటీజీ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.