Home News Jio 5G లాంచ్: దీపావళి కల్లా 5జీ సేవలు పొందే నగరాలివే

Jio 5G లాంచ్: దీపావళి కల్లా 5జీ సేవలు పొందే నగరాలివే

హైలైట్స్:

జియో 5జీ లాంచ్: జియో ట్రూ 5జీ, అక్టోబర్ 24 కల్లా భారత్ లో అందుబాటులోకి రానుంది. దీపావళి కల్లా తమ 5జీ నెట్వర్క్ ని ప్రారంభిస్తామని ప్రముఖ టెలీకామ్ కంపెనీ జియో యాన్యువల్ జనరల్ మీటింగ్, 2022 లో ప్రకటించింది. తన 4జీ నెట్వర్క్ పై ఒక్క శాతం కూడా ఆధారపడకుండా, సొంతంగా 5జీ సేవలను జియో ట్రూ 5జీ పేరుతో అందిస్తామని జియో ప్రకటించింది. తొలిదశ లో పలు భారతీయ నగరాల్లో జియో 5జీ సేవలు మొదలు కానున్నాయి. “ముందు ప్రధాన నగరాల్లో 5జీ సేవలు మొదలవుతాయి. డిసెంబర్ 23 కల్లా దేశ వ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తాయి. ప్రతి పట్టణం, తాలూకా, మండలానికి 5జీ నెట్వర్క్ చేరువవుతుంది,” అని ముకేశ్ అంబానీ వెల్లడించారు.

ఈ దీపావళికి జియో 5జీ నెట్వర్క్ ని పొందే నగరాలివే

Jio 5G సేవలు, సిమ్, బ్యాండ్స్

జియో 5జీ నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత ప్రభావవంతమైన 5జీ గా చెప్పబడుతోంది. స్టాండలోన్ నెట్వర్క్ ద్వారా ఈ సేవలు అందనున్నాయి. అందుకోసం జియో సంస్థ ప్రత్యేకమైన ఇన్ఫాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేసింది. నాన్-స్టాండలోన్ నెట్వర్క్ మాదిరి స్టాండలోన్ నెట్వర్క్ 4జీ పై ఆధారపడదు. దీనర్థం మీరు జియో 5జీ సేవలను పొందాలంటే కొత్త సిమ్ ను తీసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ భారత్ లో తన 5జీ ప్లాన్స్ ని ప్రకటించాల్సి ఉంది. కానీ, జియో ఎయిర్ ఫైబర్ అల్ట్రా 5జీ హాట్ స్పాట్ ని జియ్ ప్రకటించింది. దీంతో వైర్లెస్ హై-స్పీడ్ ఇంటర్నెట్ ని పొందవచ్చు.

“స్టాండలోన్ 5జీ ఆర్కిటెక్చర్ తో ఎన్నో లాభాలున్నాయి. స్పెక్ట్రమ్ వాడుక, క్యారియర్ అగ్రెగేషన్ టెక్నాలజీ తో జియో కవరేజీ, కెపాసిటీ, క్వాలిటీ ల మిళితమైన ఉత్తమ సేవలను అందించనుంది.” అని కంపెనీ పేర్కొంది. స్టాండలోన్ 5జీ తో నవీనమైన, శక్తివంతమైన లో-లేటెన్సీ, మ్యాసివ్ మెషీన్-టు-మెషీన్ కమ్యూనికేషన్, 5జీ వాయిస్, ఎడ్జ్ కంప్యూటింగ్, నెట్వర్క్ స్లైసింగ్, మెటావర్స్ వంటి సేవలను అందించనుంది.

3500 మెగాహెర్ట్జ్ మిడ్-బ్యాండ్ స్పెక్ట్రమ్, 25 గిగాహెర్ట్జ్ మిల్లీమీటర్ స్పెక్ట్రమ్, 700 మెగాహెర్ట్జ్ లో-బ్యాండ్ స్పెక్ట్రమ్ బ్యాండ్ పై జియో 5జీ సేవలు అందుబాటులో ఉంటాయి. 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ అద్భుతమైన ఇండోర్ కవరేజీని అందిస్తుంది. 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ ని జియో వద్ద ఉన్న మహా అస్త్రం గా చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ బ్యాండ్ కేవలం జియో వద్ద మాత్రమే ఉంది. తక్కువ టవర్స్ తో ఎక్కువ దూరం కవరేజీని అందించగలగడం ఈ బ్యాండ్ ప్రత్యేకత. అంటే 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ కి సంబంధించిన ఒక్క టవర్ దాదాపు 10 కిలోమీటర్ల పరిధి వరకు కవర్ చేస్తుంది. అలాగే శక్తివంతమైన అంతర్గత కవరేజీని అందిస్తుంది. జియో నుంచి ఏ విధమైన 5జీ ప్లాన్స్ రానున్నాయో, వాటి ధరలు ఎలా ఉండనున్నాయో త్వరలోనే వెల్లడి కానున్నాయి.