Home How To Jio 5G సర్వీస్ ని మీ ఫోన్ లో యాక్టివేట్ చేసుకోవడం ఎలా?

Jio 5G సర్వీస్ ని మీ ఫోన్ లో యాక్టివేట్ చేసుకోవడం ఎలా?

హైలైట్స్

ముకేశ్ అంబానికి చెందిన రిలయన్స్ జియో కంపెనీ భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం అన్నిచోట్లా ఈ 5జీ సేవలు అందుబాటులో లేవు. ఇంకా ఎన్నో పెద్ద, చిన్న నగరాలకు 5జీ నెట్వర్క్ విస్తరించాల్సి ఉంది. జియో 5జీ సేవలు అందుబాటులోకి రాబోవు ఫోన్ల జాబితాను జియో అప్డేట్ చేసింది. నథింగ్, శాంసంగ్ ల తర్వాత, ఇప్పుడు ఒప్పో ఫోన్ల లిస్ట్ నికూడా రిలీజ్ చేసింది.

ఈ తరుణంలో తమ 5జీ ఫోన్లలో జియో 5జీ సేవలను ఎలా యాక్టివేట్ చేసుకోవాలన్నది యూజర్లకు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ఆర్టికల్ లో మీ ఫోన్లలో జియో 5జీ సర్వీస్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో వివరంగా ఇవ్వడం జరిగింది. ఓసారి చదివి తెలుసుకోండి.

ఈ విధంగా Jio 5G నెట్వర్క్ ని మీ ఫోన్లో యాక్టివేట్ చేయండి

మీ ప్రాంతంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక, మీ ఫోన్లలో 5జీ నెట్వర్క్ వాడుకునేందుకు కొన్ని సెట్టింగ్స్ ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

Jio 5G ఎవరు పొందుతారు?

Jio 5G ట్రయల్ సర్వీస్ ప్రస్తుతం కొంతమంది ఎంపిక చేయబడిన యూజర్లకు మాత్రమే ఇన్విటేషన్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. అలా ఇన్విటేషన్ పొందిన వారు 1జీబీపీఎస్ వేగంతో కూడిన 5జీ ఇంటర్నెట్ ని 5జిబి వరకు వాడుకోవచ్చు. ఈ డేటా ఉచితం. ఎటువంటి చార్జీలు వసూలు చేయబడవు. ఇకపోతే జియో తన 5జీ సేవలను తొలుత ముంబై, ఢిల్లీ, వారణాసి, కోల్‌కతా, చెన్నై, నద్వారా ల్లో లాంచ్ చేసింది.

Jio True 5G వెల్కమ్ ఆఫర్

Jio 4G సిమ్ పైన 5జీ సేవలు

జియో ట్రూ 5జీ సేవలను ప్రకటించినప్పుడు, ఈ సేవలను వాడుకునేందుకు కస్టమర్లు తమ సిమ్ కార్డ్ ని మార్చుకోవాల్సిన పని లేదని చెప్పింది. 4జీ సిమ్ పైనే 5జీ సేవలు కొనసాగుతాయని తెలిపింది. వెల్కమ్ ఆఫర్ యూజర్లు తమ సిమ్ ని మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కావాల్సిందల్లా యూజర్ ఫోన్ 5జీ కాంపాటిబుల్ అయి ఉండాలి అంతే.

Jio 5G బ్యాండ్స్

భారత్ లో 5జీ సేవల కోసం 12 ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ పై వేలం పెట్టారు. వీటిలో n71 (600MHz), n28 (700MHz), n20 (800MHz), n5 (850MHz), n8 (900MHz), n3 (1800MHz), n1 (2100MHz), n40 (2300MHz), n41 (2500MHz), n78 (3300 – 3800MHz), n77 (3300 – 4200MHz), n79 (4400 – 5000MHz) and n258 (26GHz (24.25 – 27.5 GHz) బ్యాండ్స్ ని టెలీకామ్ సంస్థలకు ఆక్షన్ ద్వారా కేటాయించారు. ఈ వేలంపాటలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలతో పాటు అదాని గ్రూప్ కూడా పాల్గొంది.

ముకేశ్ అంబాని కంపెనీ జియో వద్ద ఉన్న 5జీ బ్యాండ్స్ ఇవే

n258 (26 GHz) స్పెక్ట్రమ్ బ్యాండ్ ని మిల్లీమీటర్ వేవ్ అని కూడా పిలుస్తారు. రీసెంట్ గా జియో కంపెనీ తన స్టాండలోన్ 5జీ ఆర్కిటెక్చర్ ని N78 బ్యాండ్ పై లాంచ్ చేసింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.