Home News రూ.2999 ప్రీపెయిడ్ ప్యాక్ ని లాంచ్ చేసిన Jio

రూ.2999 ప్రీపెయిడ్ ప్యాక్ ని లాంచ్ చేసిన Jio

హైలైట్స్:

టెలీకామ్ దిగ్గజం, జియో తాజాగా రూ.2999 ప్రీపెయిడ్ ప్యాక్ ని లాంచ్ చేసింది. జియో ప్రారంభమై 6 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఈ ప్యాక్ ని జియో లాంచ్ చేసింది. ఈ ప్యాక్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీ, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఏడాది సబ్‌స్క్రిప్షన్, జియోటీవీ, జియో సినిమా వంటి యాప్స్ కి యాక్సెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఇక రూ.2999 ద్వారా ఇంకా ప్రతిరోజు 2.5జిబి డేటా, మొత్తంగా 365 రోజులకు కలుపుకుని 912.5జిబి డేటా లభిస్తుంది.

ఇక ఆగస్టు నెలలో జియో రూ.750 ప్రీపెయిడ్ ప్యాక్ ని లాంచ్ చేసింది. ఈ ప్యాక్ 90 రోజుల వ్యాలిడిటీ, 2జిబి రోజువారీ డేటాను అందిస్తుంది. అయితే ఈ ప్యాక్ ధరను రూ.750 నుంచి రూ.749 కి తగ్గించింది. ఈ మారిన ధర ఇప్పటికే జియో వెబ్ సైట్, యాప్ పై కనిపిస్తోంది.

Jio రూ.2999 ప్రీపెయిడ్ ప్యాక్

జియో భారత దేశంలో ప్రారంభమై 6 ఏళ్ళు పూర్తైన సందర్భంగా రూ.2999 ప్రీపెయిడ్ ప్యాక్ ని జియో లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా 2.5 జిబి రోజువారీ డేటా, 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా ఏ నెట్వర్క్ కి అయినా అపరిమిత కాల్స్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అలాగే ఈ ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్, జియో సినిమా, జియో టీవీ, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి ప్లాట్ఫామ్స్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

రూ.2,999 ప్రీపెయిడ్ ప్యాక్ ని రీచార్జ్ చేసుకునే కస్టమర్లు అదనంగా 6 ప్రయోజనాలను పొందుతారు. ఇందులో 75జిబి అదనపు డేటా, అజియో, నెట్‌మెడ్స్, ఇగ్జిగో, రిలయన్స్ డిజిటల్, జియో సావన్ ప్రో నుంచి కూపన్స్ ఉన్నాయి. ఇక రూ.499 విలువగల డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. రూ.2,999 ప్రీపెయిడ్ ప్యాక్ ని జియో వెబ్ సైట్, ఇతర మాధ్యమాల ద్వారా కస్టమర్లు రీచార్జ్ చేసుకోవచ్చు.

ముందే అనుకున్నట్లుగా, జియో రూ.750 ప్రీపెయిడ్ ప్యాక్ ఇప్పుడు రూ.749 గా మారింది. మార్పు చేయబడిన ధర ఇప్పటికే జియో అధికార వెబ్ సైట్ పై కనిపిస్తోంది. అయితే, బెనిఫిట్స్ మాత్రం అవే ఉంటాయి. వాటిలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ ప్యాక్ ద్వారా 2జిబి రోజువారి డేటా, ఏ నెట్వర్క్ కి అయిన అపరిమిత కాల్స్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు, 90 రోజుల వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.