రిలయన్స్ జియో సంస్థ ఈ ఏడాది ఆఖర్లో Jio Phone 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. అయితే, ఇప్పటి వరకు కంపెనీ నుంచి లాంచ్ కి సంబంధించి అధికార సమాచారం రాలేదు. కానీ, గత వారం ఒక ట్విట్టర్ యూజర్ ఫోన్ ఇమేజెస్ ని షేర్ చేశారు. అలాగే, ఇప్పుడు టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు.
Jio Phone 5G స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ, ఆపరేటింగ్ సిస్టమ్, కెమెరా, బ్యాటరీ కెపాసిటీ వంటి వివరాలను టిప్‌స్టర్ షేర్ చేశారు. Jio Phone 5G స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. Jio Phone 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ ఎస్ఎమ్4350 ప్రొ చిప్సెట్ ని అందించనున్నారు. Jio Phone 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పూర్తి స్పెసిఫికేషన్స్ ఇక్కడ చూడండి.
Jio Phone 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Jio Phone 5G స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది.
- ప్రాసెసర్: Jio Phone 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ ఎస్ఎమ్4350 ప్రొ చిప్సెట్ ని అందించనున్నారు.
- ఓఎస్: Jio Phone 5G స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ని అందించారు.
- కెమెరా: Jio Phone 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Jio Phone 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Jio Phone 5G డివైజ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై 5, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
Jio Phone 5G ధర (లీక్)
Jio Phone 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో రూ.10,000 లోపు ధరతో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. లీక్ ప్రకారం, Jio Phone 5G ఈ ఏడాది భారతీయ మార్కెట్ లో దీపావళి పండుగ సందర్భంగా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అంటే నవంబర్-డిసెంబర్ మధ్యలో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
Jio Phone 5G లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)
ఈ ఏడాది జరగబోయే రిలయన్స్ సంస్థ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో Jio Phone 5G ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే రిలయన్స్ జియో నుంచి ఫోన్ లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
