సరిగ్గా ఏడాది క్రితం మొబైల్ యూజర్లు 5జీ నెట్వర్క్ గురించి ఇప్పటిలా ఆలోచించలేదు. ఇప్పటికి ఎన్నో నగరాల్లో 5జీ విస్తరణ పూర్తయ్యింది. ఇదంతా ఏవ్వరూ కూడా ఆనాడు ఊహించి ఉండరు. కానీ నేడు ఇదంతా సాధ్యమైంది. భారత్ లో 5జీ నెట్వర్క్ కి సపోర్ట్ చేసే 5జీ హ్యాండ్సెట్స్ 4జీ ఫోన్ల కంటే భారీ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఇక ఇప్పుడు చవకైన 5జీ ఫోన్ లాంచ్ పై కంపెనీల ఫోకస్ పడింది. ఈ రేసులోకి టెలీకామ్ దిగ్గజం జియో అడుగుపెట్టింది. తన Jio Phone 5G ని త్వరలో ఈ సంస్థ లాంచ్ చేయబోతోంది.
భారత్ లో చవకైన ఫోన్ గా నిలవనున్న Jio Phone 5G
రిలయన్స్ జియో తీసుకొస్తోన్న Jio Phone 5G ఫోన్ చవకైన 5జీ ఫోన్ గా నిలవనుంది. కౌంటర్‌పాయింట్స్ కథనం ద్వారా Jio Phone 5G యొక్క ధర బయటకు వచ్చింది. దాని ప్రకారం, Jio Phone 5G ధర భారత్ లో రూ.8,000 ఉంటుందని తెలుస్తోంది.
Jio Phone 5G ధర
Jio Phone 5G భారతీయ మార్కెట్ లో ఒక మెమొరీ వేరియంట్ కంటే ఎక్కువ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.8,000 గా ఉంటుందని అంచనా. హైఎండ్ వేరియంట్ ధర గరిష్టంగా రూ.12,000 వద్ద ఉండనుందని సమాచారం. అయితే ఈ ఫోన్ కి సంబంధించి కచ్చితమైన సమాచారం బయటకు రాలేదు. అయితే 4జిబి ర్యామ్, 6జిబి ర్యామ్ వేరియంట్స్ లో ఫోన్ లభిస్తుందని మాత్రం అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత్ లో ఉన్న చవకైన 5జీ ఫోన్ గా Lava Blaze 5G అగ్రస్థానంలో ఉంది. దీని మార్కెట్ ధర రూ.10,999 గా ఉంది.
Jio Phone 5G స్పెసిఫికేషన్స్
- 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
- 13ఎంపి + 2ఎంపి రియర్ కెమెరా
- 8ఎంపి సెల్ఫీ కెమెరా
- 4జిబి ర్యామ్
- 32జిబి స్టోరేజీ
- ప్రగతి ఓఎస్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 చిప్
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఇప్పటి వరకు బయటకు వచ్చిన లీక్స్ మరియు రిపోర్ట్స్ ప్రకారం, Jio Phone 5G డివైజ్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్ తో వస్తోంది. ఈ ఫోన్ స్క్రీన్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో తయారైనట్లు సమాచారం. ఈ స్క్రీన్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది.
Jio Phone 5G డివైజ్ ప్రగతి ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఓఎస్ ని గూగుల్ ప్రత్యేకంగా భారతీయ మొబైల్ యూజర్ల కోసం తయారు చేసింది. Jio Phone 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 చిప్సెట్ వాడారు. Jio Phone 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీతో రానుంది. మరొక హైఎండ్ వేరియంట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
Jio Phone 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అయితే ఫోన్ కి సంబంధించిన స్పెషిఫికేషన్స్ ని కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Source – 91mobiles Hindi
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
