Home News ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో ప్రదర్శితమైన JioPhone Prima 4G

ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో ప్రదర్శితమైన JioPhone Prima 4G

Highlights
  • ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చిన JioPhone Prima 4G
  • వాట్సాప్, యూట్యూబ్ సపోర్ట్ తో వచ్చిన ఫోన్
  • అఫీషియల్ గా దీపావళికి లాంచ్ కానున్న డివైజ్

న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023 (IMC)లో రిలయన్స్ జియో తన JioPhone Prima 4G ని ప్రదర్శించింది. ఈ ఫీచర్ ఫోన్ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. ఇంకా WhatsApp, YouTube మరియు అనేక సోషల్ మీడియా యాప్స్ సపోర్ట్ తో వస్తోంది. ఈ డివైజ్ కంపెనీ యొక్క స్వంత ఇ-రిటైల్ వెబ్‌సైట్, JioMartలో ఈ ఫోన్ ని కొనుగోలు చేసే వారి కోసం కొన్ని ఆఫర్‌లతో పాటుగా జాబితా చేయబడింది.

JioPhone Prima 4G ఫీచర్ ఫోన్ దీపావళి నాటికి భారతదేశంలో అధికారికంగా లాంచ్ అవుతుందని IMC వద్ద రిలయన్స్ జియో ప్రకటించింది. అయితే, ఢిల్లీ మరియు ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఫోన్ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉందని JioMart ఇప్పటికే చూపిస్తోంది. JioPhone Prima 4G రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.  JioPhone Prima 4G ధర మరియు లభ్యతతో పాటు దాని స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లను తెలుసుకుందాం పదండి.

JioPhone Prima 4G ధర, లభ్యత

JioPhone Prima 4G JioMartలో రూ. 2,599 ధరతో లిస్ట్ చేయబడింది. బ్లూ మరియు ఎల్లో కలర్ వేరియంట్లలో ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. భారతదేశంలో దీపావళి సందర్భంగా ఫోన్ అధికారికంగా లాంచ్ అవుతుందని చెప్పబడినప్పటికీ, ఇది ఇప్పటికే JioMart లో అమ్మకానికి లిస్ట్ చేయబడింది. లాంచ్ ఆఫర్‌లలో క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, బ్యాంక్ ఆఫర్‌లు మరియు కూపన్‌లు ఉన్నాయి.

JioPhone Prima 4G స్పెసిఫికేషన్స్