Jio: కొత్త ప్లాన్ తీసుకొచ్చిన జియో, 12 ఓటీటీ యాప్స్, డేటా, కాలింగ్ ఉచితం.. పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • 28 రోజుల వ్యాలిడిటీతో కొత్త జియో ప్లాన్ విడుదల
  • కొత్త ప్లాన్ యొక్క ధర రూ.448
  • డెయిలీ 2జిబి డేటా, అపరిమిత కాల్స్

భారతదేశంలోని దిగ్గజ టెలీకామ్ కంపెనీ Jio తాజాగ ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసింది. రూ.448 విలువ గల ఈ ప్లాన్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు యూజర్లకు లభించనున్నాయి. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు, ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలతో పాటు, 12 ఓటీటీ యాప్స్ కి సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఈ రీచార్జ్ ప్లాన్‌ను మై జియో యాప్ లేదా జియో అధికార వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సరే, ఓసారి రూ.448 ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలు తెలుసుకుందాం.

జియో రూ.448 ప్లాన్ ప్రయోజనాలు

జియో తీసుకొచ్చిన రూ.448 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, 2జిబి డెయిలీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి.

ఓటీటీ బెనిఫిట్‌గా జియోటీవీ ప్రీమియమ్ కస్టమర్లకు లభిస్తుంది. జియోటీవీ ప్రీమియమ్ పై కస్టమర్లకు 12 ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి యాక్సెస్ లభిస్తుంది.

సోనిలివ్, జీ5, జియోసినిమా ప్రీమియమ్, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్‌నెక్స్ట్, కంచ లంక, ప్లానెట్ మరాఠి, హొయ్‌చొయ్, చౌపల్ మరియు ఫ్యాన్‌కోడ్ వంటి ప్లాట్ఫామ్స్ కి యాక్సెస్ పొందవచ్చు. ఇంకా ఈ బండిల్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు జియోక్లౌడ్ బెనిఫిట్ కూడా లభిస్తుంది.

గమనిక: జియో సినిమా ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రీచార్జ్ తర్వాత, మైజియో అకౌంట్ లో కూపన్ అందుబాటులో ఉంటుంది. ప్లాన్ వ్యాలిడిటీ వరకు మాత్రమే ఓటీటీ యాప్స్ కి యాక్సెస్ లభిస్తుంది. జియోసినిమా ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్‌ను సెపరేట్‌గా రూ.29 కి జియో యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

జియో రూ.448 ప్లాన్ రీచార్జ్ చేసుకోవచ్చా?

జియో విడుదల చేసిన రూ.448 ప్లాన్ మాత్రమే జియోటీవీ ప్రీమియమ్ తో వస్తోంది. జియో యూజర్లకు ఇతర ఎంటర్టెయిన్మెంట్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ, జియోటీవీ ప్రీమియమ్ ద్వారా ఇతర ఓటీటీల మాదిరిగా చక్కటి కంటెంట్ లభిస్తుంది. కాబట్టి, కస్టమర్లు ఈ ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు.

Previous articleiPhone 16 లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి
Next articleMotorola Edge 50 vs Realme 13 Pro: ఏ ఫోన్ బ్యాటరీ మెరుగైనది?
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.