JioBook ఎట్టకేలకు భారత్ లో లాంచ్ అయ్యింది. రెవొల్యూషనరీ లెర్నింగ్ ల్యాప్‌టాప్ గా మార్కెట్ చేయబడుతోన్న ఈ డివైజ్ భారత్ లో సరసమైన ధరలో లభించే 4జీ ల్యాప్‌టాప్ గా నిలవనుంది. ఈ ల్యాప్‌టాప్ ఏ వయసు వారికైనా చదువు లేదా ఆఫీసు పని నిమిత్తం ఉపయోగపడనుంది. ఈ డివైజ్ ధరను రూ.20,000 లోపు పెట్టారు. JioBook జియోఓఎస్, జియోబియన్ కోడింగ్ సాఫ్ట్‌వేర్, 100జిబి క్లౌడ్ స్టోరేజీ, మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వచ్చింది.
భారత్ లో JioBook ధర, లభ్యత
ఆగస్టు 5 నుంచి JioBook సేల్ మొదలుకానుంది. ఈ ల్యాప్ టాప్ ధరను భారత్ లో రూ.16,499 గా నిర్ణయించారు. ఇది దేశంలోనే అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఉన్న ల్యాప్ టాప్. అమెజాన్ ఇండియా, రిలయన్స్ డిజిటల్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు. జియో బ్లూ కలర్ ఆప్షన్ లో JioBook ల్యాప్ టాప్ లభించనుంది.
JioBook స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: JioBook ల్యాప్‌టాప్ లో 11.6-ఇంచ్ ఎల్ఈడీ బ్యాక్లైట్ డిస్ప్లే, 1366*768 పిక్సెల్స్ స్క్రీన్ రెజుల్యూషన్, యాంటీ-గ్లేర్ లేయర్ ఉంటాయి.
- కొలతలు, బరువు: JioBook ల్యాప్ టాప్ 990 గ్రాముల బరువు ఉంటుంది. ఈ డివైజ్ 27.3 సె.మీ పొడవు, 19.0 సె.మీ వెడల్పు, 1.65 సె.మీ మందం ఉంటుంది. ఈ లైట్ వెయిట్ ల్యాప్ టాప్ ని విద్యార్థులు తేలిగ్గా మోసుకొని వెళ్ళవచ్చు.
- చిప్సెట్: JioBook ల్యాప్ టాప్ లో మీడియాటెక్ ఎమ్టీ8788 ఆక్టా-కోర్ ప్రాసెసర్, ఏఆర్ఎమ్ మాలి జీ72 ఎమ్పీ3 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: JioBook ల్యాప్ టాప్ లో 64జిబి స్టోరేజీ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 256జిబి వరకు పెంచుకోవచ్చు.
- బ్యాటరీ: JioBook లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది సింగిల్ చార్జ్ పై 8 గంటల పాటు బ్యాకప్ అందిస్తుంది.
- సాఫ్ట్‌వేర్: JioBook ల్యాప్ టాప్ JioBIAN ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఓఎస్ లైనక్స్ ఆధారిత సాఫ్ట్‌వేర్.
- కెమెరా: JioBook ల్యాప్ టాప్ లో 2ఎంపి హెచ్డీ ఫ్రంట్ కెమెరాను అందించారు.
