హైలైట్స్:
- బింబిసార ఓటీటీ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సైట్
- థియేటర్లలో దుమ్మురేపుతోన్న కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార, సినిమాకు అన్నిచోట్లా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన
- 500బీసీ లో జరిగే కథతో రూపొందిన బింబిసార, దర్శకత్వం వహించిన మల్లిడి వశిష్ట్
ఇటీవలె థియేటర్లలో విడుదలైన సోషియో-ఫ్యాంటసీ డ్రామా బింబిసార బ్లాక్‌బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. పాజిటివ్ టాక్ తో నడుస్తోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబడుతోంది. చాలా రోజుల తర్వాత నటుడు కళ్యాణ్ రామ్ కి మాంచి హిట్ పడ్డట్లైంది. దీంతో కళ్యాణ్ రామ్ యమజోరు మీద కనిపిస్తున్నాడు.
తాజాగా ఈ చిత్ర ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకున్నట్లు సమాచారం. దీనికి తోడు, శాటిలైట్ హక్కులను కూడా జీ5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత జీ5 దక్కించుకున్న రెండో భారీ చిత్రం బింబిసార కావడం విశేషం. ఈమధ్య జీ5 ఓటీటీ వరుసబెట్టి సినిమాలను కొనుగోలు చేస్తోంది. దీన్ని బట్టి దిగ్గజ ఓటీటీ సైట్స్ అయిన ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమేనని జీ5 సంకేతాలు పంపుతున్నట్లు స్పష్టమవుతోంది. రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.
కొన్ని వారాల్లోనే బింబిసార మేకర్స్ సినిమా యొక్క ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఇక ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోన్న బింబిసార చిత్రానికి ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ తోడవ్వడంతో సినిమా ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. దీంతో సినిమా ఓటీటీ లోకి రావడానికి సమయం పట్టనుంది. కనీసం 4 నుంచి 5 వారాలు తర్వాతే మనం బింబిసార చిత్రాన్ని ఓటీటీ పై చూసే అవకాశముంటుంది.
ఇక ఈ ఫ్యాంటసీ ఎపిక్ టేల్ లో నందమూరి కళ్యాణ్ రామ్ కనికరంలేని రాజు బింబిసారుడిగా నటించాడు. కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా సంయుక్తా మేనన్, వరీనా హుస్సేన్ కథానాయికలుగా చేశారు. దిగ్గజ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి నేపథ్యం సంగీతం సమకూర్చారు.
Bimbisara బాక్సాఫీస్ రిపోర్ట్:
బాక్సాఫీస్ వద్ద బింబిసార చిత్రం భారీ వసూళ్ళు రాబడుతోంది. మొదటి రోజునే ఈ చిత్రం మాంచి ఆక్యుపెన్సీతో బ్రేకీవెన్ మార్క్ లో 45 శాతం వసూలు చేసింది. వీకెండ్ లో కూడా ఇదే జోరుని కొనసాగించిన బింబిసార అన్ని జోన్లలో లాభాల్లోకి వెళ్ళింది. వీకెండ్ పూర్తయ్యే సరికి బింబిసార రూ.17.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది కళ్యాన్ రామ్ కెరీర్ బెస్ట్ కావడం విశేషం. కళ్యాణ్ రామ్ నటించిన మరో హిట్ పటాస్ చిత్రం యొక్క రూ.17 కోట్ల మార్క్ ని బింబిసార క్రాస్ చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మించాడు.
ఈ సినిమా ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చాక మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. త్వరలోనే నిర్మాతల నుంచి బింబిసార చిత్రం యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ప్రకటన వచ్చే అవకాశముంది. లేటెస్ట్ ఓటీటీ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.