Home News రెండు ఎలక్ట్రిక్ బైక్స్ ని పరిచయం చేసిన Kawasaki

రెండు ఎలక్ట్రిక్ బైక్స్ ని పరిచయం చేసిన Kawasaki

హైలైట్స్

2022 EICMA ఈవెంట్ లో ఎన్నో ఆటోమొబైల్ కంపెనీలు తమ తమ ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేశాయి. అదే ఈవెంట్ లో కవాసాకి తన రెండు ఎలక్ట్రిక్ బైక్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ బండ్లను నింజా ఎలక్ట్రిక్ బైక్, జీ ఎలక్ట్రిక్ అని పిలుస్తున్నారు. ఈ రెండు ఈ-బైక్స్ 2023 లో సేల్ కి రానున్నాయి. అయితే భారత మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ అవుతున్నాయో ఇంకా తెలియదు. కంపెనీ కూడా ఇండియాలో లాంచ్ విషయమై ఏ ప్రకటన చేయలేదు. అలాగే ఈ బండ్లు అధికారికంగా Z BEV, Ninja BEV పేర్లతో అమ్మబడతాయని సమాచారం. ఈ రెండు ఈ-బైక్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఎలక్ట్రిక్ Kawasaki Ninja లాంచ్

ప్రస్తుతం ఎలక్ట్రిక్ Ninja, Z మోడల్స్ ఇంకా ప్రోటోటైప్ ఫామ్ లోనే ఉన్నాయి. వచ్చే ఏడాది నుంచి కొనుగోలుకి రెండు మోడల్స్ అందుబాటులోకి వస్తాయని కవాసాకి మోటార్స్ ప్రెసిడెంట్ హిరోషి ఇటో తెలిపారు. జెడ్400, నింజా 400 బైక్స్ స్పూర్తితో Z BEV, Ninja BEV లను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఈ బండ్లు ఏ1 నార్మ్స్ కి లోబడి వస్తోన్న ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ బైక్స్.

మరోవైపు ఎలక్ట్రిక్ కవాసాకి బండ్లు 11 కిలోవాట్ మోటర్ ని కలిగి ఉన్నాయి. ఇంకా వీటిలో 3.0 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. చార్జింగ్ టైమ్ మరియు టోటల్ రైడింగ్ రేంజ్ వంటి వివరాలు ప్రస్తుతం రివీల్ కాలేదు. అయితే ఈ బైక్స్ పెర్ఫామెన్స్ బాగానే ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. Z BEV ఈ-బైక్ ని వచ్చే ఏడాది యూరప్ లో లాంచ్ చేయాలని కవాసాకి భావిస్తోంది. Ninja BEV ఒక ప్రోటోటైప్ మాత్రమే. కానీ, దీనికి కూడా Z BEV తో కలిసి సేల్ కి వెళ్ళే సత్తా ఉంది. అయితే ఈ బండ్లు భారత్ లో లాంచ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ.

మూడేళ్ళ క్రితం ఇదే ఈవెంట్ లో, కవాసాకి తీసుకొచ్చిన ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ నింజా 10 కిలోవాట్ మోటర్ ని కలిగి ఉంది. ఇది 20 కిలో వాట్ పీక్ రేటింగ్ కలిగి ఉంది. అలాగే ఈ బండి సింగిల్ చార్జ్ పై 100 కిలోమీటర్ల దూరం పరిగెడుతుందని కంపెనీ ప్రకటించింది. మరి ఈసారి కవాసాకి పరిచయం చేసిన బండ్లైనా భారత మార్కెట్ లో అడుగుపెడతాయా లేదా అనేది తెలియదు. భారత్ లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఈ తరుణంలో కవాసాకి కూడా ఈ రెండింట్లో ఓ దాన్ని ఇండియాలో లాంచ్ చేస్తుందని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.