Home News 43-ఇంచ్, 32-ఇంచ్ ఏఐ-పవర్డ్ QLED టీవీలను లాంచ్ చేసిన KODAK

43-ఇంచ్, 32-ఇంచ్ ఏఐ-పవర్డ్ QLED టీవీలను లాంచ్ చేసిన KODAK

ప్రముఖ టెలివిజన్స్ తయారీదారు Kodak.. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ మరియు అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా కొత్త ఏఐ-పవర్డ్ క్యూఎల్ఈడీ టీవీని లాంచ్ చేసింది. ఈ టీవీ 32 మరియు 43 ఇంచుల సైజుల్లో లభిస్తుంది. ఈ టీవీలో డాల్బీ డిజిటల్ ప్లస్, గూగుల్ అసిస్టంట్ మరియు 48 వాట్ స్పీకర్ ఔట్‌పుట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ స్మార్ట్‌టీవీ యొక్క పూర్తి ఫీచర్లు మరియు ధర వివరాలను తెలుసుకుందాం.

Kodak 32-ఇంచ్, 43-ఇంచ్ క్యూఎల్ఈడీ టీవీ ధర మరియు లభ్యత

Kodak 32-ఇంచ్ క్యూఎల్ఈడీ టీవీ ధరను రూ.11,499 గా నిర్ణయించారు. అమెజాన్ ద్వారా ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. మరోవైపు 43-ఇంచ్ క్యూఎల్ఈడీ టీవీ ధరను రూ.21,999 గా పెట్టారు. ఈ టీవీని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ మరియు అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు టీవీ మోడల్స్ పై ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. సేల్ ముగిసాక, ఈ ఆఫర్లు ఉండకపోవచ్చు.

Kodak 32-ఇంచ్ మరియు 43-ఇంచ్ క్యూఎల్ఈడీ టీవీల ఫీచర్లు

Kodak 32-ఇంచ్ క్యూఎల్ఈడీ టీవీలో 178 డిగ్రీ వైడ్ యాంగిల్ వ్యూయింగ్, స్క్రీన్ మిర్రరింగ్ ఫంక్షనాలిటీ వంటివి ఇమ్మర్సివ్ ఎంటర్టెయిన్మెంట్ అనుభూతిని అందిస్తాయి.

ఈ Kodak క్యూఎల్ఈడీ టీవీలో 3 హెచ్డీఎంఐ పోర్ట్స్, రెండు యూఎస్బీ పోర్టులు, బిల్ట్-ఇన్ వై-ఫై ఉన్నాయి. డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ టెక్నాలజీ, డ్యూయల్ బాక్స్ స్పీకర్స్, 48 వాట్ ఆర్ఎంఎస్ ఔట్‌పుట్ ఉన్నాయి.

ఫ్లాగ్షిప్ Kodak 43-ఇంచ్ 4కే క్యూఎల్ఈడీ టీవీ లో డీటీఎస్ ట్రూసరౌండ్, క్యూఎల్‌ఈడీ 4కే డిస్ప్లే, డాల్బీ ఎంఎస్12, హెచ్డీఆర్10+, 2జిబి ర్యామ్ మరియు 16జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ టీవీ బెజెల్-లెస్ డిజైన్, ఏరోస్లిమ్ ప్రొఫైల్ తో వచ్చింది. బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్, ఎయిర్‌ప్లే సపోర్ట్, హెచ్డీఆర్10+, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, డాల్బీ డిజిటల్ ప్లస్, 1000+ యాప్స్ ఉన్నాయి.

Kodak 43-ఇంచ్ 4కే క్యూఎల్ఈడీ టీవీలో యూఎస్బీ 2.0, హెచ్డీఎంఐ 3, ఏఆర్‌సీ/సీఈసీ, బ్లూటూత్ 5.0 టెక్నాలజీ ఉన్నాయి.

Source