లాల్ సింగ్ చడ్డా OTT ప్రీమియర్ పై షాకింగ్ అప్డేట్

హైలైట్స్:

  • ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లాల్ సింగ్ చడ్డా
  • ఆంగ్ల చిత్రం ఫారెస్ట్ గంప్ ఆధారంగా రూపొందిన లాల్ సింగ్ చడ్డా
  • హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలవుతోన్న సినిమా. ఓటీటీ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్

ఆమిర్ ఖాన్ నటించిన హిందీ చిత్రం లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11, 2022 న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం కోసం ఆమిర్ ఖాన్ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అద్వైత్ చందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కరీనా కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా చేసింది. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలవుతోంది. తెలుగు హీరో నాగ చైతన్య ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించాడు.

లాల్ సింగ్ చడ్డా చిత్ర హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడొక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చిన తర్వాత సరిగ్గా 6 నెలలకు నెట్‌ఫ్లిక్స్ లో ప్రీమియర్ కానుందట. అంటే ఈ చిత్రం 2023 ప్రథమార్థంలోనే ఓటీటీ లోకి రానుంది. దీంతో రెండు సినిమాలు కూడా ఒకేసారి ఓటీటీ లో ప్రీమియర్ అవ్వనున్నాయి. దీంతో మేకర్స్ షాకింగ్ మూవ్ తీసుకున్నారని అందరూ అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, లాల్ సింగ్ చడ్డా చిత్ర హక్కులను రూ.160 కోట్ల భారీ రేటుకి అమ్మేసినట్లు సమాచారం.

టాలీవుడ్ నటుడు నాగ చైతన్య ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. లాల్ సింగ్ చడ్డా చిత్రానికి ప్రీతమ్ సంగీతం సమకూర్చాడు.

తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోన్న Laal Singh Chaddha

ఈ చిత్రం తెలుగులో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం చిరంజీవి ఇంట్లో లాల్ సింగ్ చడ్డా ప్రివ్యూ వేశారు. దర్శకులు రాజమౌళి, సుకుమార్, నటులు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, ఆమీర్ ఖాన్ లు కలిసి లాల్ సింగ్ చడ్డా ని తిలకించారు. చిత్రాన్ని చూశాక, చైతన్య, ఆమీర్ ఖాన్ ల నటనపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 11 న విడుదలవుతోంది.

Forrest Gump చిత్రానికి రీమేక్

ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన లాల్ సింగ్ చడ్డా ఆంగ్ల చిత్రం ఫారెస్ట్ గంప్ కి హిందీ రీమేక్. అలాగే ఈ చిత్రం తెలుగు లోకి డబ్ అవుతోంది. 1994 లో ఫారెస్ట్ గంప్ చిత్రం విడుదలైంది. ఈ అమెరికన్ కామెడీ-డ్రామా కి రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వం వహించారు. ఎరిక్ రోత్ కథను సమకూర్చారు. 1986 లో ఫారెస్ట్ గంప్ అనే పేరుతో విన్‌స్టన్ గ్రూమ్ రచించిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. టామ్ హ్యాంక్స్, రాబిన్ రైట్, గ్యారీ సినైస్, మైకెల్టీ విలియమ్సన్, సల్లీ ఫీల్డ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. తక్కువ తెలివితేటలు మరియు దయాగుణం కలిగిన ఓ వ్యక్తి కథే ఈ ఫారెస్ట్ గంప్ చిత్రం.