Lava A5 2023: 4 రోజులు బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఫోన్

Highlights

  • కొత్త ఫీచర్ ఫోన్ ని ప్రకటించిన Lava
  • 4 రోజుల బ్యాటరీ లైఫ్ అందించే Lava A5 2023
  • ఇంకా వెల్లడి కాని Lava A5 2023 ధర

దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Lava తన కొత్త ఫీచర్ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ పేరు Lava A5 2023. ఇంతకుముందు, కంపెనీ 2019 లో Lava A5 ను లాంచ్ చేసింది. ప్రస్తుతం లాంచ్ అయిన కొత్త ఫీచర్ ఫోన్ గురించి మాట్లాడితే, అనేక గొప్ప ఫీచర్లు మరియు స్పెషల్ డిజైన్ ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ భారతదేశంలో అందుబాటులో ఉన్న జియోఫోన్‌లతో పోటీ పడగలదని అనిపిస్తోంది. ఫోన్ ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇందులో అందించిన బ్యాటరీ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 4 రోజుల బ్యాకప్ అందిస్తుంది. సరే, ఓసారి Lava A5 2023 డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Lava A5 2023 డిజైన్

Lava A5 2023 డిజైన్ యూనిక్ గా ఉంది. ముందువైపున చిన్నపాటి డిస్ప్లే, క్రింద భాగంలో QWERTY కీప్యాడ్ ఉన్నాయి. కీప్యాడ్ లో మధ్య భాగంలో గుండ్రంగా ఉండే టార్చ్ బటన్ ని ప్రత్యేకంగా అమర్చారు. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై వీజీఏ కెమెరా, ఫ్లాష్ లైట్ నిలువుగా అమర్చారు. వీటికి సమాంతరంగా శక్తివంతమైన స్పీకర్ ని పెట్టారు.

Lava A5 2023 ఫీచర్స్

  • Lava A5 2023 ఫీచర్ ఫోన్ లో డ్యూయల్ ఎల్ఈడీ హై-బీప్ టార్చ్ అందించారు. వెలుతురు తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ టార్చ్ బాగా ఉపయోగపడుతుంది.
  • ఇంకా Lava A5 2023 లో కీప్యాడ్ పై పెద్ద ఐకాన్స్ ఇవ్వడం వల్లన తేలికగా గుర్తించే వీలుంటుంది.
  • ఒక్కసారి Lava A5 2023 డివైజ్ ని పూర్తిగా ఛార్జ్ చేస్తే 4 రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని కంపెనీ తెలియజేస్తోంది.
  • Lava A5 2023 డివైజ్ కి బ్యాక్ ప్యానెల్ పై పవర్ఫుల్ స్పీకర్స్ అమర్చారు. ఇది ఉత్తమమైన సౌండ్ ని అందిస్తుంది.
  • ఈ కీప్యాడ్ ఫోన్ డస్ట్ రెసిస్టన్స్ తో వస్తోంది. దీని వల్లన దుమ్ము, ధూళి ఫోన్ పై పోగయ్యే అవకాశం ఉండదు.
  • Lava A5 2023 ఫీచర్ ఫోన్ లో డెడికేటెడ్ వైబ్రేషన్ మోడ్ అందించారు.