
ప్రముఖ స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా త్వరలోనే Lava Agni 2 5G లాంచ్ చేయబోతోంది. 2021 లో లాంచైన అగ్ని 5జీ కి Lava Agni 2 5G సక్సెసర్ గా వస్తోంది. Lava Agni 2 5G లో ఎన్నో అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయని సమాచారం. అయితే, లావా సంస్థ ఇంకా లాంచ్ తేదీని ఖరారు చేయలేదు. ఈలోపు, Lava Agni 2 5G ప్రధాన స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన రిపోర్ట్ ఒకటి నెట్టింట్లో ప్రత్యక్షమైంది.
ఆ రిపోర్ట్ ప్రకారం, Lava Agni 2 5G డివైజ్ డిజైన్ మరియు డిస్ప్లే విషయంలో అప్‌గ్రేడ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే భారత్ లో ఈ ఫోన్ ధర దాదాపు రూ.20,000 గా ఉంటుందని సమాచారం. సరే, ఓసారి Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.
Lava Agni 2 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- కర్వ్డ్ అమోలెడ్
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
Lava Agni 2 5G లో కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఉండనుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉంటుందని సమాచారం. ఈ రెండు కూడా గత మోడల్ అగ్ని 5జీ తో పోల్చితే మంచి మార్పులని చెప్పాలి. ఇవ్ననీ లావా అగ్ని 2 5జీ ని మేటిగా నిలబెట్టే అవకాశం ఉంది.
కెమెరా విభాగం
- 50ఎంపి మెయిన్ కెమెరా
- ఎల్ఈడీ ఫ్లాష్
Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కెమెరా మాడ్యూల్ క్రింద ఉంది. కెమెరా మాడ్యూల్ లుక్ బాగుంది. ఫోన్ లవర్స్ ని ఆకట్టుకునే రీతిలో కెమెరా మాడ్యూల్ ని డిజైన్ చేశారు. ఇది గత మోడల్ తో పోల్చితే సూపర్ అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు.
చిప్సెట్
- డైమెన్సిటీ 7050
Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వస్తోంది. ఈ చిప్సెట్ డైమెన్సిటీ 1080 కి రీబ్యాడ్జ్డ్ వర్షన్. ఇక గత మోడల్ అగ్ని 5జీ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ తో వచ్చింది. Lava Agni 2 5G డివైజ్ డబుల్-రీఇన్‌ఫోర్స్‌డ్ ప్రీమియమ్ గ్లాస్ బ్యాక్ డిజైన్ తో వస్తోంది.
ర్యామ్, ఓఎస్
- 8జిబి ర్యామ్
- ఆండ్రాయిడ్ 13
Lava Agni 2 5G లో 8జిబి వరకు ర్యామ్ ఉంటుందని గీక్ బెంచ్ ద్వారా తెలిసింది. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు తెలిసిన వివరాలు ఇవే. బ్యాటరీ కెపాసిటీ, చార్జింగ్ స్పీడ్, ఫ్రంట్ కెమెరా సెన్సర్ వివరాలు ఇంకా తెలియలేదు. త్వరలోనే ఇవి కూడా తెలియనున్నాయి. త్వరలోనే లావా సంస్థ నుంచి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.











