
స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా తాజాగా Lava Agni 2 స్మార్ట్ ఫోన్ ని టీజ్ చేసింది. ఈ 5జీ ఫోన్ కొన్ని రోజుల్లో లాంచ్ కానుంది. ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని లావా వెల్లడించలేదు. లాంచ్ కి ముందు Lava Agni 2 కి చెందిన ముఖ్య సమాచారం నెట్టింట్లో ప్రత్యక్షమైంది. లావా నుంచి వస్తోన్న ఈ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో రానుందని సమాచారం.
నేడు మీడియాటెక్ సంస్థ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ని లాంచ్ చేసిన కాసేపటికే Lava Agni 2 సమాచారం బయటకు వచ్చింది. సరే, ఓసారి Lava Agni 2 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Lava Agni 2 5G గురించి ఇప్పటి వరకు తెలిసిన సమాచారం
- మీడియాటెక్ డైమెన్సిటీ 7050
- మాలి-జీ68 జీపీయూ
Lava Agni 2 డివైజ్ ఈ నెలలోనే లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వస్తోందని సమాచారం. ఈ చిప్సెట్ 2.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. మాలి-జీ68 జీపీయూ ఈ చిప్సెట్ తో పెయిర్ అయ్యింది. ఈ 6ఎన్ఎమ్ ప్రాసెసర్ 200ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్, డ్యూయల్ 5జీ, 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, వై-ఫై 6 కి సపోర్ట్ చేస్తుంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ కి రీబ్యాడ్జ్ వర్షన్ గా డైమెన్సిటీ 7050 చిప్సెట్ వచ్చిందని తెలుస్తోంది. సెగ్మెంట్ లో ఉన్న ఇతర చిప్సెట్స్ పెర్ఫామెన్స్ తో పోటీపడేందుకై డైమెన్సిటీ 1080 చిప్సెట్, డైమెన్సిటీ 7050 పేరుతో రీబ్రాండ్ అయి వచ్చిందని సమాచారం.
మీడియాటెక్ 7050 చిప్సెట్ మే 10 న చైనాలో లాంచ్ కానున్న Realme 11 Pro+ 5G లో కూడా కనిపించనుంది.
Lava Agni 2 స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- అమోలెడ్ డిస్ప్లే
Lava Agni 2 లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుందని రీసెంట్ లీక్ ద్వారా తెలిసింది. గతంలో వచ్చిన అగ్ని 5జీ ఫోన్ 90 హెర్ట్జ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ని కలిగి ఉంది. లీకైన సమాచారం నిజమే అయితే ఇది డిస్ప్లే విభాగంలో మంచి అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు.
ఓఎస్, ర్యామ్, స్టోరేజీ
- ఆండ్రాయిడ్ 13
- 8జిబి/128జిబి
కొన్ని రోజుల క్రితం గీక్ బెంచ్ పై Lava Agni 2 డివైజ్ కనిపించింది. లిస్టింగ్ ప్రకారం, ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలిసింది.
Lava Agni 2 ధర (అంచనా)
- ధర రూ.25,000 లోపు ఉండే అవకాశం
లీక్ ప్రకారం, Lava Agni 2 డివైజ్ ధర రూ.25,000 లోపు ఉండే అవకాశం ఉంది. అగ్ని 5జీ డివైజ్ రూ.20,000 లోపు ధరతో భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే Lava Agni 2 గురించి ఇంకా లావా నుంచి పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











