
2021 లో దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ Lava భారతీయ మార్కెట్ లో Lava Agni 2 5G ని లాంచ్ చేసింది. ఇప్పుడు టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సౌజన్యంతో Pricebaba వెబ్ సైట్ Lava Agni 2 5G కి సంబంధించిన ఒక కథనాన్ని వెలువరించింది. ఈసారి లావా సంస్థ Lava Agni 2 5G తో పాటు ఒక ప్రో-వేరియంట్ ని కూడా తీసుకురానుందని పారస్ గుగ్లాని చెబుతున్నాడు. అయితే, కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు.
Lava Agni 2 5G మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ గా మార్కెట్ లోకి రానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో ఈ ఫోన్ రానుంది. Lava Agni 2 5G డివైజ్ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో లాంచ్ కానుంది. ఓ రిపోర్ట్ ద్వారా Lava Agni 2 5G యొక్క భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. సరే, ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.
Lava Agni 2 5G స్పెసిఫికేషన్స్
Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్ తో రానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడనున్నట్లు సమాచారం. రెడ్మీ నోట్ 12 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో+ డివైజెస్ లో కూడా ఇదే చిప్సెట్ వాడారు.
Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యమా్, 128జిబి స్టోరేజీతో రానుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది. పవర్ బ్యాకప్ కోసం Lava Agni 2 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తోందని అంచనా. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ డివైజ్ లో టైప్-సీ పోర్ట్ అందించారు.
Lava Agni 2 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంటుంది. Lava Agni 2 5G లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని ఇస్తున్నారు. ఇది పవర్ బటన్ లోనే ఎంబెడ్ అయి వస్తోంది. భారత్ లో Lava Agni 2 5G ధర రూ.25,000 లోపు ఉండనుంది. ఇదే గనుక నిజమైతే డైమెన్సిటీ 1080 చిప్సెట్ కలిగిన చవకైన ఫోన్ గా Lava Agni 2 5G నిలిచే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











