ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Lava Agni 3 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 6.78-ఇంచ్ 1.5కే కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.
Lava Agni 3 5G ఇండియా లాంచ్ తేదీ
Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో అక్టోబర్ 4వ తేదీన లాంచ్ అవుతోంది. ఢిల్లీలో ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. లావా అగ్ని 3 5జీ యొక్క ధర, సేల్ మరియు స్పెసిఫికేషన్స్ ఇదే ఈవెంట్ లో రివీల్ కానున్నాయి.
అక్టోబర్ 4న ఉదయం 11 గంటలకు అగ్ని 3 5జీ యొక్క లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. లావా కంపెనీ వెబ్‌సైట్, యూట్యూబ్ ప్లాట్ఫామ్ మరియు కంపెనీకి చెందిన ఇతర అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా లాంచ్ ఈవెంట్ చూడవచ్చు.
🔥🔥🔥#ProudlyIndian pic.twitter.com/heSR2C0viT
— Lava Mobiles (@LavaMobile) September 26, 2024
Lava Agni 3 5G భారత మార్కెట్ ధర
Lava Agni 3 5G భారత మార్కెట్ ధర వివరాలు లావా కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. అయితే అంచనా ప్రకారం, Lava Agni 3 5G ప్రారంభ ధర రూ.21,990 ఉంటుందని తెలుస్తోంది. డిస్కౌంట్స్ మరియు బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో ఈ ఫోన్ రూ.19,999 కే లభించనుంది.
Lava Agni 3 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Lava Agni 3 5G లో 6.78-ఇంచ్ పంచ్ హోల్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.
ప్రాసెసర్: Lava Agni 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.
ర్యామ్, స్టోరేజీ: Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది.
కెమెరా: Lava Agni 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, చార్జింగ్: Lava Agni 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
పైన పేర్కొనబడిన స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు లీక్స్ ఆధారంగా అందించినవి. సరైన వివరాలు అక్టోబర్ 4వ తేదీన ఫోన్ లాంచ్ అయ్యాక తెలుస్తాయి.
