Home News Lava Agni 3 5G: డ్యూయల్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న అగ్ని 3

Lava Agni 3 5G: డ్యూయల్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న అగ్ని 3

Highlights
  • Lava Agni 3 5G ధర శ్రేణి ఖరారు
  • అక్టోబర్ 4వ తేదీన లాంచ్
  • ప్రత్యేకాకర్షణగా డ్యూయల్ స్క్రీన్స్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Lava Agni 3 5G పేరుతో వస్తోన్న ఈ ఫోన్ అక్టోబర్ 4వ తేదీన విడుదలవుతోంది. నిన్నే ఈ ఫోన్ యొక్క గ్లిమ్స్ రివీల్ అయ్యింది. నేడు మరో కొత్త టీజర్ వీడియో ద్వారా కంపెనీ పూర్తి డిజైన్ ను రివీల్ చేసింది. ధర శ్రేణి కూడా ఖరారైంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Lava Agni 3 5G డిజైన్

టీజర్ వీడియోలో Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో కనిపిస్తోంది.

ఫోన్ ముందువైపు డిజైన్ చూస్తే, కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది చూడటానికి ఎంతో ప్రీమియమ్ లుక్ అందిస్తోంది.

బ్యాక్ ప్యానెల్ పై మూడు కెమెరాలు రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో కనిపిస్తున్నాయి. ఇదే మాడ్యూల్ లో సెకండరీ డిస్ప్లే కూడా ఉండటం విశేషం.

సెకండరీ డిస్ప్లే ద్వారా ప్రైమరీ కెమెరాను సెల్ఫీల కోసం వాడుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్స్ చెక్ చేయడం, కాల్స్ ఆన్సర్ చేయడం వంటి పనులు చేయవచ్చు.

ఫోన్‌కి కుడివైపున పవర్ బటన్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ బాటమ్ లో బ్రాండింగ్ కనిపిస్తోంది.

Lava Agni 3 5G ధర శ్రేణి

Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ధర శ్రేణిని లావా నేడు అధికారికంగా టీజర్ వీడియో ద్వారా వెల్లడించింది. రూ.30,000 లోపు భారతదేశపు మొదటి డ్యూయల్ అమోలెడ్ డిస్ప్లే ఫోన్ అంటూ తన వీడియో పోస్ట్ లో లావా పేర్కొంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ సేల్‌కి వస్తుందని కంపెనీ తెలిపింది.

Lava Agni 3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Agni 3 5G లో 6.78-ఇంచ్ పంచ్ హోల్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.

ప్రాసెసర్: Lava Agni 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది.

కెమెరా: Lava Agni 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Lava Agni 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఇతర ఫీచర్లు: Lava Agni 3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ఉంటాయి.