Home News 90Hz డిస్ప్లే, డైమెన్సిటీ 700 చిప్‌తో భారత్ లో లాంచైన Lava Blaze 1X 5G

90Hz డిస్ప్లే, డైమెన్సిటీ 700 చిప్‌తో భారత్ లో లాంచైన Lava Blaze 1X 5G

Highlights
  • భారతీయ బడ్జెట్ కస్టమర్ల కోసం లాంచైన Lava Blaze 1X 5G
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వచ్చిన డివైజ్
  • ఆఫ్‌లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా అందుబాటులోకి వచ్చిన Lava Blaze 1X 5G

స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా భారత్ లో Lava Blaze 1X 5G డివైజ్ ని లాంచ్ చేసింది. Lava Blaze 1X 5G డివైజ్ 5జీ కనెక్టివిటీ తో వచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.5-ఇంచ్ డిస్ప్లే ఉన్నాయి. తక్కువ బడ్జెట్ కొనుగోలుదారులను ఉద్దేశించి లావా కంపెనీ ఈ ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

రీసెంట్ గా లావా సంస్థ Lava Blaze 2, Lava Yuva 2 మరియు Lava Agni 2 5G వంటి ఫోన్లను లాంచ్ చేసింది. అయితే, Lava Blaze 1X 5G డివైజ్ ని మెల్లగా భారత మార్కెట్ లోకి లాంచ్ చేసింది. వివరాలు లావా తన వెబ్‌సైట్ లో లిస్ట్ చేసింది. సరే, ఓసారి Lava Blaze 1X 5G డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Lava Blaze 1X 5G ధర, కలర్స్, లభ్యత

భారత్ లో Lava Blaze 1X 5G డివైజ్ 6జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ తో లాంచైంది. ఈ ఫోన్ ధర రూ.11,999 గా ఉంది. గ్లాస్ గ్రీన్ మరియు గ్లాస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ హ్యాండ్సెట్ లభిస్తుంది. ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Lava Blaze 1X 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Lava Blaze 1X 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 2.5డి కర్వ్డ్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

కెమెరాలు

Lava Blaze 1X 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, వీజీఏ డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

చిప్సెట్

Lava Blaze 1X 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడారు. ఇది గేమింగ్ కి కూడా బాగానే పని చేస్తుంది.

స్టోరేజీ

ఈ ఫోన్ లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ అందించారు. అయితే, 5జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉండటం విశేషం. ఇంటర్నల్ స్టోరేజీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు పెంచుకోవచ్చు.

బ్యాటరీ

Lava Blaze 1X 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్, సెక్యూరిటీ

Lava Blaze 1X 5G డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

డైమెన్షన్స్, వెయిట్

ఈ ఫోన్ 165.3 మిల్లీ మీటర్ల పొడవు, 76.4 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం, 207 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.