భారతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్ లావా తాజాగా మార్కెట్ లో LAVA Blaze 2 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 13ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 6జిబి ర్యామ్, యూనిసాక్ టీ616 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో మార్కెట్ లో లాంచైంది. సరే, ఓసారి LAVA Blaze 2 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
LAVA Blaze 2 ధర మరియు సేల్ వివరాలు
LAVA Blaze 2 స్మార్ట్ ఫోన్ కేవలం సింగిల్ వేరియంట్ లో మాత్రమే లాంచైంది. ఈ ఫోన్ 6జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తోంది. LAVA Blaze 2 భారత మార్కెట్ లో రూ.8,999 ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ గ్లాస్ బ్లూ, గ్లాస్ బ్లాక్ మరియు గ్లాస్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఏప్రిల్ 18 నుంచి LAVA Blaze 2 డివైజ్ సేల్ మొదలవుతుంది. అమెజాన్ ఇండియా వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనాలని భావించే వారు స్పెసిఫికేషన్స్ పూర్తిగా చదివి, మీకు సరిపడేదైతే గనుక ప్రయత్నించండి.
LAVA Blaze 2 స్పెసిఫికేషన్స్
- యూనిసాక్ టీ616 ప్రాసెసర్
- 5జిబి వర్చువల్ ర్యామ్
- 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ
LAVA Blaze 2 స్మార్ట్ ఫోన్ పంచ్-హోల్ డిజైన్ డిస్ప్లే, 6.5-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. డిస్ప్లే కి మూడు వైపులా బెజెల్స్ సన్నగా ఉన్నాయి. బాటమ్ లో చిన్ మందంగా ఉంది. టాప్ లో ఫ్రంట్ కెమెరా కోసం పంచ్-హోల్ ఉంది. ఇది కెమెరా సెన్సర్ కంటే పెద్దగా కనిపిస్తోంది.
LAVA Blaze 2 స్మార్ట్ ఫోన్ లో యూనిసాక్ టీ616 ప్రాసెసర్ వాడారు. ఈ చిప్సెట్ 255298 అంటుటు స్కోర్ ని నమోదు చేసినట్లు కంపెనీ చెబుతోంది. రూ.10 వేల ధరలో లభించే మీడియాటెక్ హీలియో జీ85 మరియు హీలియో జీ88 చిప్సెట్స్ ని కూడా ఇది వెనక్కి నెడుతుంది. ఈ లావా డివైజ్ 5జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నల్ 6జిబి ర్యామ్ తో కలుపుకుని మొత్తం 11జిబి ర్యామ్ యూజర్ కి లభిస్తుంది.
13ఎంపి ఏఐ కెమెరా
LAVA Blaze 2 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ సెన్సర్, ఈ సెన్సర్ సెకండరీ ఏఐ సెన్సర్ తో కలిసి పని చేస్తుంది.
18 వాట్ ఫాస్ట్ చార్జింగ్
LAVA Blaze 2 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో బ్లూటూత్, డ్యూయల్ సిమ్, 4జీ, జీపీఎస్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
