Home News Lava Blaze 3 5G: రూ.9,999 ధరతో వస్తోన్న లావా కొత్త ఫోన్

Lava Blaze 3 5G: రూ.9,999 ధరతో వస్తోన్న లావా కొత్త ఫోన్

Highlights
  • త్వరలో Lava Blaze 3 5G విడుదల
  • 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో బ్లేజ్ సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Lava Blaze 3 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదల కానుంది. లాంచ్ తేదీని కంపెనీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే డివైజ్ యొక్క మైక్రోసైట్, ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్, డిజైన్, ధర వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Lava Blaze 3 5G డిజైన్

Lava Blaze 3 5G స్మార్ట్‌ఫోన్ ప్రీమియమ్ గ్లాస్ డిజైన్ తో వస్తోంది. ఇంకా బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్, వైబ్ ఎల్ఈడీ లైట్ ఉంటాయి. తక్కువ బడ్జెట్ అయినా ఫోన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫ్రంట్ ప్యానెల్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో పంచ్ హోల్ కటౌట్, ఫ్లాట్ స్క్రీన్ ఉన్నాయి.

Lava Blaze 3 5G ధర

Lava Blaze 3 5G స్మార్ట్‌ఫోన్ రూ.9,999 ధరతో లాంచ్ కానుందని అమెజాన్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది. బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. Lava Blaze 3 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో వస్తోంది.

Lava Blaze 3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Blaze 3 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: Lava Blaze 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. అంటుటు స్కోర్ 4,10,000.

ర్యామ్, స్టోరేజీ: Lava Blaze 3 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వస్తోంది. ఈ ఫోన్ లో 6జిబి వర్చువల్ ర్యామ్ ని అందించనున్నారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభించనుంది.

కెమెరా: Lava Blaze 3 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి ఏఐ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Lava Blaze 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Lava Blaze 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.

ఇతర ఫీచర్లు: Lava Blaze 3 5G లో స్టీరియో స్పీకర్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.