Home News Lava Blaze 3 5G: 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన బ్లేజ్ 3 5జీ

Lava Blaze 3 5G: 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన బ్లేజ్ 3 5జీ

Highlights
  • భారత్‌లో Lava Blaze 3 5G విడుదల
  • డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
  • 5000mAh బ్యాటరీ, 18W చార్జింగ్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava తాజాగా బ్లేజ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Lava Blaze 3 5G పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ లెవెల్ కస్టమర్లను ఉద్దేశించి ఈ ఫోన్‌ని తీసుకొచ్చారు. ఈ ఫోన్ లో ప్రీమియమ్ గ్లాస్ డిజైన్, 6.56-ఇంచ్ స్క్రీన్, 12జిబి వరకు ర్యామ్, 50ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Lava Blaze 3 5G ధర

Lava Blaze 3 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.11,499 గా నిర్ణయించారు. ఈ ఫోన్ పై రూ.1,500 బ్యాంక్ ఆఫర్ అందించారు. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అమెజాన్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్‌ సేల్‌కి వస్తోంది.

Lava Blaze 3 5G స్మార్ట్‌ఫోన్ గ్లాస్ గోల్డ్ మరియు గ్లాస్ బ్లూ అనే రెండు కలర్స్ లో లబిస్తుంది.

Lava Blaze 3 5G డిజైన్

Lava Blaze 3 5G లో గ్లాస్ బ్యాక్ డిజైన్ అందించారు. బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ లైట్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్ అయినా ఈ ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మరోవైపు, ఫ్రంట్ లో పంచ్ హోల్ ఫ్లాట్ స్క్రీన్ అందించారు.

Lava Blaze 3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Blaze 3 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Blaze 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఇచ్చారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. అంటుటు స్కోర్ 4,10,000.

ర్యామ్, స్టోరేజీ: Lava Blaze 3 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది. 6జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Lava Blaze 3 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి ఏఐ లెన్స్ అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Lava Blaze 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Lava Blaze 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Lava Blaze 3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.