Home News Lava Blaze 5G: నవంబర్ 15 న ఫస్ట్ సేల్

Lava Blaze 5G: నవంబర్ 15 న ఫస్ట్ సేల్

హైలైట్స్

స్వదేశీ మొబైల్ ఫోన్ కంపెనీ Lava ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ ని పరిచయం చేసింది. ఈ ఫోన్ ఇటీవలె అమెజాన్ ద్వారా రివీల్ అయ్యింది. ఇప్పుడు కంపెనీ ఈ ఫోన్ సేల్ తేదీని అధికారికంగా ప్రకటించింది. రూ.9,999 ఇంట్రడక్టరీ ధరతో ఫోన్ ని లావా తీసుకొచ్చింది. Lava Blaze 5G నవంబర్ 15 నుంచి భారత మార్కెట్ లో విక్రయానికి వస్తోంది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Lava Blaze 5G మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ తో వస్తోంది. 4జిబి ర్యామ్ వేరియంట్ లో ఈ ఫోన్ లభించనుంది. 90 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లే, 50 మెగా పిక్సెల్ కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి. Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ రెడ్మీ 11 ప్రైమ్ 5జీ, పోకో ఎమ్4 ప్రో 5జీ, రియల్మీ 9ఐ 5జీ ఫోన్స్ తో పోటీ పడనుంది. Lava Blaze 5G యొక్క ధర, లభ్యత, ఇతర స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Lava Blaze 5G ధర, లభ్యత

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింద ఈ ఫోన్ రూ.9999 కే లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ నవంబర్ 15 న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా మొదలవుతుంది.

Lava Blaze 5G స్పెసిఫికేషన్స్

Lava Blaze 5G లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. Lava Blaze 5G వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికేషన్ తో వస్తోంది.

Lava Blaze 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ వాడారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ ఉపయోగించారు. డైమెన్సిటీ 700 చిప్ 7ఎన్ఎమ్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ ని మనం ఎన్నో మిడ్ రేంజ్ హ్యాండ్సెట్స్ లో చూశాం. రెడ్మీ 11 ప్రైమ్ 5జీ, పోకో ఎమ్3 ప్రో 5జీ, రియల్మీ 8 5జీ తదితర ఫోన్లలో ఈ ప్రాసెసర్ ని వాడారు.

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ లో 4జిబి ఆన్‌బోర్డ్ ర్యామ్ తో పాటు 3జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. దీని ద్వారా మొత్తం 7జిబి ర్యామ్ ని పొందవచ్చు. ఇకపోతే 128జిబి ఇంటర్నల్ స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.

ఇప్పుడు Lava Blaze 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. Lava Blaze 5G లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

Lava Blaze 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఇది పవర్ బటన్ లో నిక్షిప్తమై ఉంటుంది. Lava Blaze 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.