హైలైట్స్
- భారతదేశపు చవకైన 5జీ ఫోన్ గా వస్తోన్న Lava Blaze 5G
- అమెజాన్ ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం
- Lava Blaze 5G ఇంట్రడక్టరీ ప్రైస్ రూ.9,999
స్వదేశీ కంపెనీ Lava ఇటీవలె అత్యంత చవకైన 5జీ స్మార్ట్ ఫోన్ Lava Blaze 5G ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. నేటి నుంచి Lava Blaze 5G మొదటి సేల్ ప్రారంభమవుతోంది. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న చీపెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ Lava Blaze 5G. ఈ హ్యాండ్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 4జిబి ర్యామ్ తో వస్తోంది.
Lava Blaze 5G లభ్యత
Lava Blaze 5G నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి Amazon India వెబ్‌సైట్/యాప్ ద్వారా కొనేందుకు అందుబాటులో ఉంటుంది.
Lava Blaze 5G ధర, లాంచ్ ఆఫర్స్
Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధర రూ.10,999 గా నిర్ణయించారు. అయితే ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింద Lava Blaze 5G రూ.9,999 కే లభించనుంది.
Lava Blaze 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ (1600*720) పిక్సెల్ రెజుల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికేషన్ తో వస్తుండటం విశేషం. అంటే మీరు ఓటీటీ కంటెంట్ ని హెచ్డీ క్లారిటీతో చూడవచ్చు. ఇంకా సెల్ఫీ కెమెరా కోసం ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చారు.
Lava Blaze 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ని వాడారు. ఇది 7ఎన్ఎం ప్రాసెస్ పై తయారైన చిప్. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వినియోగించారు. ఈ డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజీతో వస్తోంది. Lava Blaze 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.
Lava Blaze 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. ఈ హ్యాండ్సెట్ లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
Lava Blaze 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని అందించారు. ఈ ఫోన్ లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. Lava Blaze 5G లో (హైబ్రిడ్) మైక్రో-ఎస్డీ కార్డ్ స్లాట్ ఉంది. డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
Lava Blaze 5G రెండు కలర్ ఆప్షన్స్ లో లభ్యమవుతోంది. అవి: గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్. ఈ హ్యాండ్సెట్ 165.3 మిల్లీ మీటర్ల పొడవు, 76.4 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం, సుమారు 200 గ్రాముల బరువు ఉంటుంది.
Lava Blaze 5G పోటీ పడేది వీటితోనే
Lava Blaze 5G ప్రథమంగా POCO M4 5G, Samsung Galaxy M13 5G, Moto G51 5G ఫోన్లతో పోటీ పడనుంది. అయితే ఈ జాబితాలో రూ.10,000 లోపు ధరలో లభిస్తోన్న ఏకైక ఫోన్ Lava Blaze 5G.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.