Home News భారత్ లో లాంచ్ అయిన Lava Blaze 5G స్మార్ట్ ఫోన్

భారత్ లో లాంచ్ అయిన Lava Blaze 5G స్మార్ట్ ఫోన్

హైలైట్స్:

స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన Lava తాజాగా Lava Blaze 5G అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది లావా కంపెనీ నుంచి వచ్చిన తొలి 5జీ స్మార్ట్ ఫోన్. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 లో కేంద్ర రైల్వేస్, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ హ్యాండ్సెట్ ని రివీల్ చేశారు. Lava Blaze 5G భారతదేశపు అత్యంత చౌకైన 5జీ స్మార్ట్ ఫోన్ అని కంపెనీ చెబుతోంది. అయితే ఇంకా ఈ ఫోన్ యొక్క ధరను కంపెనీ వెల్లడించలేదు. రూ.10,000 రేంజ్ లో ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం లావ్ బ్లేజ్ లైనప్ లో రెండు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అయితే అవి 4జీ హ్యాండ్సెట్స్. అవి: Lava Blaze, Lava Blaze Pro. పీఎమ్ నరేంద్ర మోదీ శనివారం నాడు దేశంలో 5జీ సేవలను లాంచ్ చేసిన అనంతరం లావా కంపెనీ Lava Blaze 5G ఫోన్ ని లాంచ్ చేసింది.

భారత్ లో Lava Blaze 5G ధర, లభ్యత

ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా భారత్ లో Lava Blaze 5G ధర అత్యంత చౌకగా ఉండనుంది. ఈ హ్యాండ్సెట్ ధర దాదాపు రూ.10,000 గా ఉండే అవకాశం ఉంది. త్వరలోనే సేల్ తేదీ, ధర వివరాలను లావా వెల్లడించనుంది. Lava Blaze 5G ప్రీ-ఆర్డర్ దీపావళి నుంచి ప్రారంభం కానుంది. బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో Lava Blaze 5G ఫోన్ లభించనుంది.

Lava Blaze 5G స్పెసిఫికేషన్స్

Lava Blaze 5G లో 6.5-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంది. అలాగే 1600*720 పిక్సెల్స్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఈ డిస్ప్లే సొంతం. మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ ని ఈ ఫోన్లో వినియోగించారు. Lava Blaze 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. చార్జింగ్ స్పీడ్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తోంది. వర్చువల్ ర్యామ్ ద్వారా 3జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు. అలాగే ఈ ఫోన్లో మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉంది.

Lava Blaze 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు. అలాగే Lava Blaze 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఒక డెప్త్ సెన్సర్, ఒక మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అమర్చారు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై Lava Blaze 5G ఫోన్ పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.