
ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఈ ఏడాది మార్చిలో బ్లేజ్ సిరీస్ లో Lava Blaze Curve 5G అనే డివైజ్‌ను లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ పై డిస్కౌంట్ లభిస్తోంది. రూ.1,000 డిస్కౌంట్ తో పాటు, రూ.1,500 వరకు బ్యాంక్ ఆఫర్ కూడా అమెజాన్ ప్లాట్ఫామ్ పై అందుబాటులో ఉంది. దీంతో పాటు రూ.16,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు కొత్త ధర మరియు ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.
Lava Blaze Curve 5G ఆఫర్లు, ధర
Lava Blaze Curve 5G రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. రెండింటిపై కూడా రూ.1,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ప్రస్తుతం రూ.16,999 గా ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది.
బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ కూడా కలుపుకుంటే, అప్పుడు రెండు మోడల్స్ వరుసగా రూ.15,499 మరియు రూ.16,499 కి లభిస్తాయి.
బ్యాంక్ ఆఫర్ తో పాటు, ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.16,000 వరకు పొందవచ్చు. అయితే మీ పాత ఫోన్ కండీషన్‌ను బట్టి, బోనస్ నిర్ణయించబడుతుంది.
3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ క్లిక్ చేసి అమెజాన్ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
Lava Blaze Curve 5G కొనవచ్చా?
ఈ ఏడాది మార్చిలోనే Lava Blaze Curve 5G లాంచ్ అయ్యింది. తక్కువ ధరలో మంచి 5జీ అనుభూతిని ఈ ఫోన్ అందిస్తుంది. ఈ ఫోన్ లో కర్వ్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ 7050 6ఎన్ఎమ్ చిప్సెట్, 64ఎంపి రియర్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కాబట్టి, ఇదొక మంచి ఆప్షన్ అవుతుంది.
Lava Blaze Curve 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Lava Blaze Curve 5G లో 6.67-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Lava Blaze Curve 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఈ చిప్ హై క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్.
ర్యామ్, స్టోరేజీ: Lava Blaze Curve 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ తో లాంచ్ అయ్యింది. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.
కెమెరా: Lava Blaze Curve 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: Lava Blaze Curve 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: Lava Blaze Curve 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్స్ మరియు 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
కనెక్టివిటీ: Lava Blaze Curve 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఓటీజీ, యూఎస్బీ టైప్ సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











