ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్ లో Blaze Curve 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. చైనీస్ స్మార్ట్ఫోన్లకు ఈ స్వదేశీ బ్రాండ్ ఫోన్ గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. ఇకపోతే, Lava Blaze Curve 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, కర్వ్డ్ డిస్ప్లే, ఆకట్టుకునే డిజైన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వచ్చింది. సరే, ఓసారి ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Lava Blaze Curve 5G ధర, లభ్యత
- Lava Blaze Curve 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో భారత్ లో లాంచ్ అయ్యింది.
- Lava Blaze Curve 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.17,999 గా ఉంది. 256జిబి వేరియంట్ ధరను రూ.18,999 గా నిర్ణయించారు.
- Lava Blaze Curve 5G డివైజ్ సేల్ మార్చి 11న మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.
- Lava Blaze Curve 5G డివైజ్‌ని అమెజాన్, లావా ఈ-స్టోర్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Lava Blaze Curve 5G డిజైన్
- Lava Blaze Curve 5G డివైజ్ కర్వ్డ్ డిస్ప్లేని కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై టాప్ లో ఎడమవైపున ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
- Lava Blaze Curve 5G డివైజ్ కి కుడివైపున వాల్యూమ్ కంట్రోల్స్ మరియు పవర్ బటన్ ఉన్నాయి.
- Lava Blaze Curve 5G కి టాప్ లో స్పీకర్ గ్రిల్ ఉంది.
Lava Blaze Curve 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Lava Blaze Curve 5G లో 6.67-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Lava Blaze Curve 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఈ చిప్ హై క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్.
- ర్యామ్, స్టోరేజీ: Lava Blaze Curve 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ తో లాంచ్ అయ్యింది. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.
- కెమెరా: Lava Blaze Curve 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Lava Blaze Curve 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Lava Blaze Curve 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్స్ మరియు 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
- కనెక్టివిటీ: Lava Blaze Curve 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఓటీజీ, యూఎస్బీ టైప్ సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
