సెప్టెంబర్ 26న లాంచ్ అవుతోన్న Lava Blaze Pro 5G; కన్ఫర్మ్ చేసిన కంపెనీ!

Highlights

  • యూట్యూబ్ లో కనిపించిన Lava Blaze Pro 5G టీజర్
  • రివీలైన Lava Blaze Pro 5G డిజైన్, లాంచ్ తేదీ
  • 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న డివైజ్

భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava తన తదుపరి ఫోన్ Lava Blaze Pro 5G లాంచ్ తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 26 వ తేదీన ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం, కంపెనీ ఈ ఫోన్ ని టీజ్ చేసింది. మరో విషయం ఏంటంటే ఈ హ్యాండ్సెట్ ధర చవకగానే ఉండనుంది. తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలని భావించే వారికి ఈ డివైజ్ మంచి ఆప్షన్ అవ్వవచ్చు. సరే, ఓసారి Lava Blaze Pro 5G డివైజ్ యొక్క డిజైన్, లాంచ్ తేదీ, అంచనా స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava Blaze Pro 5G లాంచ్ తేదీ, డిజైన్

లావా సంస్థ తన తదుపరి ఫోన్ గురించి ఓ వీడియోని యూట్యూబ్ లో విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ Lava Blaze Pro 5G అని సమాచారం. ఇకపోతే, ఈ డివైజ్ సెప్టెంబర్ 26 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవ్వనుంది. వీడియో ద్వారా ఫోన్ ముందు మరియు వెనుక డిజైన్ రివీల్ అయ్యింది. డివైజ్ యొక్క డిజైన్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.

  • Lava Blaze Pro 5G డివైజ్ తెలుపు రంగులో ఉన్నట్లు మీరు వీడియోలో గమనించవచ్చు.
  • Lava Blaze Pro 5G లో 3.5 ఎంఎం ఆడియో జాక్, మైక్రోఫోన్, యూఎస్బీ-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.
  • డిస్ప్లే గురించి మాట్లాడితే, ఇందులో పంచ్-హోల్ స్క్రీన్ ఉంది.
  • Lava Blaze Pro 5G డివైజ్ లో 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాస్ ఉన్నట్లు తెలుస్తోంది.
  • ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో లావా 5జీ అని బ్రాండింగ్ ఉంది.

Lava Blaze Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Lava Blaze Pro 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Lava Blaze Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ ఉంటుందని సమాచారం.
  • స్టోరేజీ: Lava Blaze Pro 5G లో 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి. ఇంకా ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వస్తోంది.
  • కెమెరా: Lava Blaze Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Lava Blaze Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Lava Blaze Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
Previous articleలీకైన Redmi K70 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్
Next articleగ్లోబల్ గా లాంచైన Samsung Galaxy A05, Galaxy A05s
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.