భారతీయ స్మార్ట్ఫోన్ తయారీదారు Lava నేడు భారతీయ మార్కెట్ లో Lava Blaze Pro 5G డివైజ్ ని లాంచ్ చేసింది. రూ.12,499 ధరతో వచ్చిన ఈ ఫోన్ చవకైన 5జీ ఫోన్ గా యూజర్లను ఆకర్షించనుంది. ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. Lava Blaze Pro 5G డివైజ్ సేల్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Lava Blaze Pro 5G ధర, సేల్ వివరాలు
Lava Blaze Pro 5G డివైజ్ ఒకే మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో వచ్చిన ఈ ఫోన్ ధరను రూ.12,499 గా నిర్ణయించారు. Lava Blaze Pro 5G సేల్ అక్టోబర్ 3 నుంచి మొదలు కానుంది. Lava Blaze Pro 5G డివైజ్ స్టారీ నైట్, రేడియంట్ పర్ల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలని భావించే వారు ఈ ఫోన్ ని ప్రయత్నించవచ్చు.
Lava Blaze Pro 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Lava Blaze Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2.5డి కర్వ్డ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Lava Blaze Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ వాడారు. ఇది 7 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
- ఓఎస్: Lava Blaze Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- మెమొరీ: Lava Blaze Pro 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. 8జిబి వరకు వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
- కెమెరా: Lava Blaze Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Lava Blaze Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Lava Blaze Pro 5G డివైజ్ 8 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ నానో సిమ్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఓటీజీ సపోర్ట్ ఉన్నాయి.
