50MP కెమెరా, Helio G37 చిప్ తో లాంచ్ అయిన Lava Blaze Pro

హైలైట్స్:

  • భారత్ లో Lava Blaze Pro స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన లావా
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఐపీఎస్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • భారత్ లో Lava Blaze Pro ధర రూ.10,499 నుంచి ప్రారంభం

దేశీయ కంపెనీ అయిన లావా, లేటెస్ట్ గా Lava Blaze Pro అనే ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్ ని కలిగి ఉంది. Lava Blaze Pro యొక్క పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం పదండి.

భారత్ లో Lava Blaze Pro ధర, కలర్ ఆప్షన్స్

భారత్ లో Lava Blaze Pro ఫోన్ ధర రూ.10,499 గా నిర్ణయించారు. ఈ ఫోన్ మొత్తం నాలుగు రంగుల్లో లభ్యమవుతుంది. అవి: గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ, గ్లాస్ గోల్డ్, గ్లాస్ ఆరెంజ్. కంపెనీ యొక్క అధికార వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ ద్వారా మీరు ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.9,999 గా ఉంది.

Lava Blaze Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Lava Blaze Pro బ్యాక్ ప్యానెల్ పూర్తిగా కొత్త డిజైన్ తో వస్తోంది. వర్టికల్ కెమెరా మాడ్యూల్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. రియర్ బాటమ్ లో లావా బ్రాండింగ్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 రేషియో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. లావా కంపెనీ 100 రోజుల స్క్రీన్ రీప్లేస్మెంట్ ని ఉచితంగా అందిస్తోంది.

మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ ని ఇందులో అమర్చారు. ప్రీడిసెస్సర్ బ్లేజ్ లో క్వాడ్ కోర్ చిప్సెట్ వాడగా, బ్లేజ్ ప్రో మోడల్ లో ఆక్టాకోర్ చిప్సెట్ అందించారు. Lava Blaze Pro 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో వస్తోంది. ఇందులో 3జిబి వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది. స్టోరేజీని కూడా మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో 256జిబి వరకు పెంచుకోవచ్చు. భద్రత కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. అలాగే ఫేస్ అన్ లాక్ ఆప్షన్ ఉంది.

ఈ ఫోన్లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ 4జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్/ఏసీ, బ్లూటూత్ 5.0 సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ కలిగి ఉంది. ఇందులో ఎఫ్ఎం రేడియో ఉంది. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Lava Blaze Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా (ఏఐ సపోర్ట్, 6ఎక్స్ జూమ్), 2ఎంపి మ్యాక్రో షూటర్, వీజీఏ లెన్స్ ఉన్నాయి. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 8ఎంపి కెమెరా అందించారు.

బ్యూటీ మోడ్, పొట్రెయిట్, ప్రో, పనోరమా, స్లో మోషన్ వీడియో, టైమ్ ల్యాప్స్ వంటి ఎన్నో కెమెరా ఫీచర్లను Lava Blaze Pro కలిగి ఉంది. అలాగే Lava Blaze Pro కెమెరాలో ఇన్-బిల్ట్ క్యూఆర్ స్కానర్ ఉండటం విశేషం.

Previous article8K వీడియో, పెరిస్కోప్ లెన్స్ తో రానున్న Apple iPhone 15 Ultra
Next articleలీకైన Vivo X90 Pro లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.