హైలైట్స్
- Lava X3 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,999
- ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) ఓఎస్ తో వచ్చిన Lava X3 స్మార్ట్ ఫోన్
- అమెజాన్ ద్వారా నేటి నుంచి Lava X3 సేల్ ప్రారంభం
Lava X3 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ వాడారు. 8ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ లాంచైంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ తో వచ్చింది. రెడ్మీ ఏ1+, టెక్నో పాప్ 6 ప్రో, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ఫోన్లలో కూడా ఇదే ఓఎస్ ని ఉపయోగించారు. సరే, ఓసారి Lava X3 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
భారత్ లో Lava X3 ధర, లభ్యత
Lava X3 స్మార్ట్ ఫోన్ 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ వేరియంట్ లో లభించనుంది. దీని ధరను రూ.6,999 గా నిర్ణయించారు. అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది.
Lava X3 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
Lava X3 స్మార్ట్ ఫోన్ లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉంటాయి. మెమొరీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 512జిబి వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పై ఫోన్ పని చేస్తుంది. భద్రత కోసం రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 3.5ఎంఎం జాక్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
Lava X3 స్మార్ట్ ఫోన్ పాలికార్బొనేట్ బాడీతో తయారైంది. ఈ ఫోన్ 6.53-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్ కలిగి ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బెజెల్స్ సన్నగా, చిన్ మందంగా ఉంటుంది. ఎంట్రీ లెవెల్ ఫోన్ గనుక ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు.
Lava X3 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8 ఎంపి ప్రైమరీ కెమెరా, మరొక వీజీఏ సెన్సర్ ఉంటాయి. ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.