ప్రముఖ దేశీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Lava Mobiles భారత్ లో Lava Yuva 2 డివైజ్ ని లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్ లో ఎంట్రీ ఫోన్ కొనాలని భావించే వారికి Lava Yuva 2 ఉత్తమమైన ఆప్షన్ గా చెప్పవచ్చు. ఈ ఫోన్ ధరను భారతీయ మార్కెట్ లో రూ.6,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ లో 3జిబి వర్చువల్ ర్యామ్ కూడా అందించారు. సరే, ఓసారి Lava Yuva 2 డివైజ్ ధర, సేల్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Lava Yuva 2 ధర, సేల్
Lava Yuva 2 స్మార్ట్ ఫోన్ భారత్ లో రూ.6,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ సింగిల్ మెమొరీ వేరియంట్ లో లభించనుంది. 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
Lava Yuva 2 కలర్ ఆప్షన్స్
Lava Yuva 2 స్మార్ట్ ఫోన్ గ్లాస్ బ్లూ, గ్లాస్ ల్యావెండర్ మరియు గ్లాస్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Lava Yuva 2 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Lava Yuva 2 డివైజ్ లో గ్లాస్ బాడీ, 6.5-ఇంచ్ హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Lava Yuva 2 లో యూనిఎస్ఓసీ టీ606 ప్రాసెసర్ వాడారు. ఇదొక ఆక్టాకోర్ చిప్.
- ఓఎస్: Lava Yuva 2 డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.
- మెమొరీ: Lava Yuva 2 డివైజ్ 3జిబి ఫిజికల్ ర్యామ్, 64జిబి స్టోరేజీ, 3జిబి వర్చువల్ ర్యామ్ ని కలిగి ఉంది.
- కెమెరా: Lava Yuva 2 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి కెమెరా అందించారు.
- బ్యాటరీ: Lava Yuva 2 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
