స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Lava నేడు భారత్ లో Lava Yuva 2 Pro స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో స్మార్ట్ ఫోన కొనాలని చూసే వారికి ఈ ఫోన్ సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ కి మారే వారికి కూడా ఈ ఫోన్ సరిపోతుంది.
Lava Yuva 2 Pro స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఆప్షన్ తో వచ్చింది. 3జిబి వర్చువల్ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఈ ఫోన్ లో ఉంటాయి. ఎస్డీకార్డ్ ద్వారా మెమొరీని 256జిబి వరకు పెంచుకోవచ్చు. సరే, ఓసారి Lava Yuva 2 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్ లో Lava Yuva 2 Pro ధర, లభ్యత
Lava Yuva 2 Pro స్మార్ట్ ఫోన్ గ్లాస్ వైట్, గ్లాస్ లావెండర్, గ్లాస్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత్ లో Lava Yuva 2 Pro ధరను రూ.7,999 గా నిర్ణయించారు. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఆప్షన్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
ఎడ్‌టెక్ ప్లాట్ఫామ్ Doubtnut తో లావా జతకట్టి ఈ ఫోన్ కొనుగోలుదారులకు ఉచిత కోర్స్ మెటీరియల్ ని అందిస్తోంది. ఈ మెటీరియల్ 9 మరియు 12 వ తరగతి చదువుతోన్న వారికి ఉపయోగపడుతుంది. ఈ కోర్స్ విలువ రూ.12,000. ఏడాది పాటు ఈ కోర్స్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. Lava Yuva 2 Pro ఫోన్ ని రిటైల్ స్టోర్స్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Lava Yuva 2 Pro స్పెసిఫికేషన్స్
Lava Yuva 2 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ అప్డేట్ తో పాటు, రెండేళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది. Lava Yuva 2 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, రెండు వీజీఏ కెమెరా యూనిట్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
Lava Yuva 2 Pro లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. ఈ డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ వాడారు. డివైజ్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉంటాయి. 3జిబి వర్చువల్ ర్యామ్ ని అందించారు.
Lava Yuva 2 Pro స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, 4జీ, 3.5ఎంఎం ఆడియో జాక్, టైప్-సీ పోర్ట్ ఉంటాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఫోన్ బరువు 204 గ్రాములు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.
