
స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో Yuva 3 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. 2023 ఆరంభంలో లాంచైన Lava Yuva 2 Pro కి Lava Yuva 3 Pro సక్సెసర్ గా వస్తోంది. తాజాగా లావా సంస్థ Lava Yuva 3 Pro లాంచ్ తేదీని ప్రకటించింది. Lava Yuva 3 Pro డివైజ్ డిసెంబర్ 14 వ తేదీన మార్కెట్ లోకి రానున్నట్లు కంపెనీ వెల్లడించింది. సరే, ఓసారి Lava Yuva 3 Pro యొక్క అంచనా స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలు తెలుసుకుందాం పదండి.
Lava Yuva 3 Pro లాంచ్ వివరాలు
Get ready to explore the Gold Standard!
Yuva 3 Pro | Launching – 14th Dec#Yuva3Pro #LavaMobiles #ProudlyIndian pic.twitter.com/WQwI9M9lo9
— Lava Mobiles (@LavaMobile) December 11, 2023
Lava Yuva 3 Pro స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 14 న భారత్ లో లాంచ్ అవుతోంది. టీజర్ వీడియో ద్వారా ఈ విషయాన్ని కంపెనీ ఖరారు చేసింది. లావా ఇండియా సోషల్ ప్లాట్‌ఫామ్స్ పై వర్చువల్ ఈవెంట్ ద్వారా Lava Yuva 3 Pro ఫోన్ లాంచ్ కానుంది. డిసెంబర్ 14 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Lava Yuva 3 Pro ధర, సేల్ వివరాలు, స్పెసిఫికేషన్స్ వెల్లడవుతాయి.
Lava Yuva 3 Pro ధర (లీక్)
టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Lava Yuva 3 Pro ధరను X ప్లాట్‌ఫామ్ ద్వారా లీక్ చేశారు. భారత్ లో రూ.10,999 ధరతో Lava Yuva 3 Pro లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు. ఇది 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర. డిసెంబర్ 14 న డివైజ్ యొక్క అసలు ధర ఏంటో తెలిసిపోనుంది.
Lava Yuva 3 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
- స్క్రీన్: Lava Yuva 3 Pro లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Lava Yuva 3 Pro లో యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్ ఉంటుంది.
- ఓఎస్: Lava Yuva 3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ప్యూర్ ఎడిషన్ పై పని చేస్తుంది.
- ర్యామ్, స్టోరేజీ: Lava Yuva 3 Pro డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో రానున్నట్లు సమాచారం.
- కెమెరా: Lava Yuva 3 Pro కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు.
- బ్యాటరీ: Lava Yuva 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











